For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వరుణ్ సందేష్ భార్య ఆత్మహత్య కాదు కానీ కారణం ఇదే: డోస్ పెరిగింది, అపస్మారక స్థితిలోకి

  |

  'హ్యాపీ డేస్' ఫేమ్ హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక షెరు ఆత్మహత్య యత్నం చేశారట..., కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది... అంటూ మంగళవారం రాత్రంతా ఒక వార్త ఇంటర్నెట్ టాలీవుడ్ లను కుదిపేసింది. అసలే వరుస సినీ ప్రముఖుల మరణాలతో అయోమయం లో ఉన్న ఇండస్ట్రీ ఈ వార్తతో మరోసారి ఉలిక్కిపడింది.

   వితిక ఆత్మహత్య కు పాల్పడ్డట్లు

  వితిక ఆత్మహత్య కు పాల్పడ్డట్లు

  వితిక షెరు కూడా సినీ నటి. వరుణ్ సందేశ్ తో కలిసి ఒక సినిమా చేశారు. ఇలా ఏర్పడిన పరిచయంతోనే వారిద్దరూ 2016లో వివాహం చేసుకున్నారు. అయితే వరుణ్ కు గత కొద్ది రోజులుగా సినిమా అవకాశాలు లేవు. కాగా వితిక ఆత్మహత్య కు పాల్పడ్డట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది.

  స్టార్ హాస్పిటల్ లో

  స్టార్ హాస్పిటల్ లో

  మరోపక్క బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతున్న ఫోటోలు అంటూ కొన్ని ఫొటోలు కూడా నెట్ లో అప్లోడ్ అయ్యాయి. దాంతో ఒక్కసారి అంతా నిజమే అనుకున్నారు... వార్త సుడిగాలిలా పాకిపోయింది. మంగళవారం రాత్రి సోషల్‌ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది.

  వార్తలన్నీ పుకార్లే

  వార్తలన్నీ పుకార్లే

  అయితే కొద్ది గంటల్లోనే ఈ వార్తలన్నీ పుకార్లేననీ తాను క్షేమంగానే ఉన్నాను అంటూ వితిక ట్వీట్ చేసింది. తరువాత ఈ విషయంలో పూర్తి క్లారిఫికేషన్ ను ఒక టీవీ ఛానెల్ లో లైవ్ ద్వారా చెపుతానంటూ తన ట్విట్టెర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దాంతో టితర్లో ఉన్న కొంతమంది ఊపిరి పీల్చుకున్నా బయటం మాత్రం ఆ వార్త స్ప్రెడ్ అవుతూనే ఉంది.

  పలు టీవీ చానెళ్ళలో

  పలు టీవీ చానెళ్ళలో

  ఆ తర్వాత ఉదయమే ఆమె పలు టీవీ చానెళ్ళలో లైవ్ ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ జనం లో ఉన్న అనుమానాలన్నీ క్లియర్ చేసేసింది. తాను హాస్పిటల్ కి వెళ్ళటం నిజమే అయినా అది ఆత్మ హత్య చేసుకోవటం వల్ల కాదనీ, తాను కొన్నాళ్ళు అమెరికాలో ఉండి రావటం వల్ల ఇక్కడ ఫుడ్, వాతావరణానికి అడ్జస్ట్ అవటానికి వచ్చే ఇబ్బందులని తప్పించుకోవటానికి డాక్టర్ కి కాల్ చేసి ఒకరకమైన టాబ్లెట్ ని ముందూ వెనకా చూసుకోకుండా ఎక్కువ డోస్ ఉన్న టాబ్లెట్ వేసుకోవటంతోనె అలా జరిగిందట.

  అపస్మారక స్తితిలో

  అపస్మారక స్తితిలో

  ఎక్కువసేపు నిద్రపోయి కొంత ఘాడ నిద్రలో ఉండిపోయాననీ, దాంతో ఖంగారు పడ్డ ఇంట్లోవాళ్ళు హాస్పిటల్ కి తీసుకువెళ్ళాక అక్కడ డాక్టర్లు స్టమక్ వాష్ చేసారనీ చెప్పింది. కొంత అపస్మారక స్తితిలో ఉన్నా పక్కవాళ్ళు మాట్లాడే మాటలన్నీ తనకు వినిపిస్తూనే ఉన్నాయనీ చెప్పుకొచ్చింది.

  చచ్చిపోవాలనుకుంటే

  చచ్చిపోవాలనుకుంటే

  అంతే కాదు చచ్చిపోవాలనుకుంటే నాలుగుటాబ్లెట్స్ వేసుకొని ఆగిపోయేదాన్ని కాదు కదా అంటూ నవ్వేసింది. అంతే కాదు మీడియాకూడా ఇలా చేయటం సరికాదనీ ఏదైనా దౌటుంటే డైరెక్ట్ గా కనుక్కొని సమాచారం చెప్పాలనీ కాస్త చిరాకు గానే చెప్పింది.. మా వివాహం లో సమస్యలనీ, నేను ఆత్మహత్య చేసుకున్నాననీ ఇలా చెప్పేస్తే నా బదువులూ, దగ్గరవాళ్ళు ఎంత భాదపడతారో ఊహించారా? అంటూ ప్రశ్నించింది.

  కొన్నాళ్లు అమెరికాలో

  కొన్నాళ్లు అమెరికాలో

  గత ఏడాది ఆగస్టులో వరుణ్‌-వితికల వివాహం జరిగింది. కొన్నాళ్లు అమెరికాలో ఉండొచ్చిన దంపతులు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. కాగా, తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్నవార్తలను వితిక ఖండించారు. ‘అవన్నీ ఫేక్‌ న్యూస్‌. మేం సంతోషంగా ఉన్నాం. పుకార్లను నమ్మొద్దు' అంటూ చెప్పింది.

  English summary
  News about Tollywood actor Varun Sandesh’s wife Vithika attempted suicide at her residence in Hyderabad on Tuesday went viral causing panic among the film circles
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X