For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా కూతురు చనిపోవడానికి కారణమిదే.. పొద్దున్నే ఫ్యాన్‌కు వేలాడుతూ: అన్నపూర్ణమ్మ షాకింగ్ కామెంట్స్

  |

  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అత్యంత సీనియర్ నటులలో అన్నపూర్ణమ్మ ఒకరు. అయితే ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతురి మృతిపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు. అంతా సవ్యంగానే ఉందని అనుకున్న క్రమంలో ఉదయాన్నే ఫ్యాన్ కు ఉరి వేసుకొని వ్రేలాడుతూ ఉండడం తనని షాక్ కు గురి చేసిందని అన్నారు. కూతురు మరణానికి గల కారణంపై కూడా ఆమె వివరణ ఇచ్చారు.

  తల్లి పాత్రలతో..

  తల్లి పాత్రలతో..

  సహజ నటిగా తల్లి పాత్రతో తెలుగు జనాలకు ఎంతో దగ్గరైన అన్నపూర్ణమ్మ 1970లోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.సంసారం ఓక చదరంగం, ముత్యమంత ముద్దు, స్వర్గం నరకం, అసెంబ్లీ రౌడీ వంటి సినిమాల్లో ఆమె నటనతో జనాలకు అలా గుర్తిండిపోయారు. మెగాస్టార్ కు తల్లిగా కూడా ఆమె చాలా సినిమాల్లో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు.

  దత్త పుత్రిక మృతి

  దత్త పుత్రిక మృతి

  అయితే వ్యక్తిగత జీవితంలో అన్నపూర్ణమ్మ ఒక తీరని విషాదాన్ని ఎదుర్కొన్నారు. ఆమె దత్త పుత్రికను ఎంతో ఆప్యాయంగా పెంచుకొని ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపింది. అంతే కాకుండా కట్న కానుకలు కూడా ఇచ్చారు. ఫ్లాట్ డబ్బు నగలు అంటూ ఒక కూతురికి ఇవ్వాల్సిన కానుకలన్నీ ఇచ్చారు. కానీ ఆమె జీవితం మొదట్లోనే కనుమారుగయ్యింది.

  కూతురు పుట్టిన తరువాత

  కూతురు పుట్టిన తరువాత

  దురదృష్టవశాత్తు కూతురు పుట్టిన కొన్నాళ్లకు ఆమె ప్రాణాలు కోల్పోయింది. బెడ్ రూమ్ లో ఆత్మహత్య చేసుకోవడంతో అప్పట్లో ఆ న్యూస్ మీడియాలో హాట్ టాపిక్ గా వైరల్ అయ్యింది. అయితే అసలు కారణం ఏమిటనేది ఎవరు కరెక్ట్ గా చెప్పలేదు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నపూర్ణమ్మ ఒక వివరణ ఇచ్చారు.

  కొంచెం కోపం ఎక్కువ

  కొంచెం కోపం ఎక్కువ

  వాళ్ళిట్లో ఏదైనా జరిగిందో లేదో నాకు తెలియదు. అమ్మాయి కూడా నాకు ఏమి చెప్పలేదు. వాళ్ళు కూడా మంచివారే. కానీ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో అర్థం కాలేదు. కానీ మా అమ్మాయికి కొంచెం కోపం ఎక్కువ. డాక్టర్ చదివించాలని అనుకున్నాను. కానీ చదువు రాలేదు. పెళ్లి చేస్తాను అంటే చేయమని చెప్పింది.. అని అన్నారు.

  ప్రాబ్లం ఏమిటనేది నాకు చెప్పలేదు.

  ప్రాబ్లం ఏమిటనేది నాకు చెప్పలేదు.

  కొన్నాళ్ళు బాగానే ఉన్నప్పటికీ తనకు కూతురు కూడా జన్మించింది. అయితే ప్రాబ్లం ఏమిటనేది నాకు చెప్పలేదు. ఎప్పుడు కూడా భర్తపై కంప్లైంట్ ఇచ్చింది లేదు. నాతో చెబితే నేను అర్థం చేసుకొనేమో అని ఫీల్ అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు కొన్ని ఎంత చెప్పినా పట్టించుకోలేదు. బహుశా లోలోపల అలా కూడా ఏదైనా దాచి బాధపడి ఉండవచ్చు.. అని మాట్లాడారు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  ఉదయమే ఫ్యాన్ కు ఉరేసుకుని

  ఉదయమే ఫ్యాన్ కు ఉరేసుకుని

  ఒకవేళ నా దగ్గరకు వచ్చి ఏదైనా సమస్య ఉందని చెప్పి ఉంటే తప్పకుండా నేను హెల్ప్ చేసేదాన్ని. అవసరం అయితే మీకు నచ్చకపోతే ఇంటికి పంపేయమని కూడా అనేదాన్ని. ఒకరోజు హ్యాపీగానే మా ఇంటి నుంచి అత్తగారింటికి వెళ్లింది. ఏదో చిన్న మాటకు హార్ట్ అయ్యి ఉండవచ్చు. అనంతరం ఉదయమే వాళ్ళ బెడ్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించింది.. ఆ విషాదం మరచిపోలేనిది అంటూ ఏదేమైనా తన ఆయుష్ష్యు అక్కడి వరకే ఉండవచ్చని.. అన్నపూర్ణమ్మ వివరణ ఇచ్చారు.

  English summary
  Annapoornamma is one of the most senior actors in the Tollywood film industry to receive a unique recognition as a character artist. However in a recent interview she commented on the daughter’s death in an unexpected way.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X