»   » రాధికా ఆప్టే గురించి షాకింగ్ న్యూస్.. కుమారి కాదు.. శ్రీమతి.. రహస్యంగా పెళ్లి.. (ఫోటోలు)

రాధికా ఆప్టే గురించి షాకింగ్ న్యూస్.. కుమారి కాదు.. శ్రీమతి.. రహస్యంగా పెళ్లి.. (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

విలక్షణ నటి రాధిక ఆప్టే నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటుంది. నిజం మాట్లాడితే కెరీర్‌కు ముప్ప కలుగుతుందా అని ఆలోచించకుండా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లేడేస్తుంది. టాలీవుడ్‌లో ఓ అగ్రహీరో తనతో అభ్యంతరకరంగ వ్యహరించారని రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. బాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా పక్కన పెట్టి సీరియస్ సినిమాల్లో బోల్డ్‌గా నటించేందుకు సిద్ధపడిన దాఖలాలు ఉన్నాయి. అయితే రాధిక ఆప్టే కుమారి కాదు.. శ్రీమతి అని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

అత్యంత గోప్యంగా..

అత్యంత గోప్యంగా..

ఇలాంటి మనస్తత్వం ఉన్న రాధిక ఆప్టేకి ఇదివరకే పెళ్లిపోయినట్టు కొందరికే తెలుసు. తన పెళ్లి గురించి చాలా గోప్యంగా వ్యవహరిస్తున్నారని రూమర్ ఉన్నది. బ్రిటిష్ సంతతికి చెందిన ఫొటోగ్రాఫర్‌ను పెళ్లాడినట్టు వార్తలు వచ్చాయి. అయితే వాటిని రాధిక ఆప్టే ధ్రువీకరించకపోవడంతో తన పెళ్లిపై ఇంకా సందిగ్ధత నెలకొన్నది.

బెనడిక్ట్ టేలర్‌తో పరిచయం.. వివాహం..

బెనడిక్ట్ టేలర్‌తో పరిచయం.. వివాహం..

ఇంతకీ రాధికా ఆప్టే పెళ్లి చేసుకొన్నది ఎవరంటే బ్రిటన్‌కు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ బెనెడిక్ట్ టేలర్. 2011లో రాధిక ఆప్టే డ్యాన్స్ నేర్చుకోవడానికి లండన్‌కు వెళ్లింది. ఆ సందర్భంగా ఆమెకు టేలర్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది అని అప్పట్లో మరాఠీ పత్రిక పుణె మిర్రర్ పేర్కొన్నది.

రిజిస్టర్ మ్యారేజ్‌..

రిజిస్టర్ మ్యారేజ్‌..

ప్రేమ బంధానికి బలమైన పునాది వేయడానికి రాధిక ఆప్టే, టేలర్‌లిద్దరూ 2012లో పెళ్లి చేసుకొన్నారు. వారి వివాహం రిజిస్టర్ మ్యారేజ్ పద్ధతిలో జరిగింది. తమ వివాహం విషయాన్ని ఎవరికీ వెల్లడించకుండా రహస్యంగా పెళ్లి చేసుకొన్నట్టు సమాచారం. అప్పటి నుంచి వారిద్దరూ సహజీవనం చేస్తున్నారట. వీసాలు, ఇతర డాక్యుమెంట్ల కోసమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొన్నట్టు తెలుస్తున్నది.

లండన్‌కు చక్కర్లు కొడుతూ..

లండన్‌కు చక్కర్లు కొడుతూ..

గుట్టుచప్పుడు కాకుండానే కాపురం చేస్తూ కెరీర్‌ను ఓ వైపు విజయవంతంగా నెట్టుకొస్తున్నది రాధికా ఆప్టే. వృత్తికి న్యాయం చేయడానికి లండన్‌కు ముంబైకి చక్కర్లు కొడుతుంటుందనే తాజా సమాచారం. ఇటీవల రజనీకాంత్‌తో కబాలి చిత్రంలోను, గతంలో లెజెండ్ చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన రాధికా ఆప్టే నటించింది.

తెలుగులో నటించను..

తెలుగులో నటించను..

హిందీలో బద్దాపూర్, హంటర్ చిత్రంలో హాట్ హాట్‌గా నటించిన రాధికా ఆప్టే తెలుగు చిత్రపరిశ్రమపై సెన్సేషనల్ కామెంట్స్ చేయడం వివాదాస్పదమైంది. హిందీలో కాకుండా నేను మలయాళం, తమిళ, తెలుగు, బెంగాళీ భాషల్లో నటించాను. తెలుగులో ఇక నటించను.. అక్కడ పురుషాధిక్యత ఎక్కువ. మహిళలను సరైన పద్ధతిలో గౌరవించరు. అందుకే ఆ భాషలో నటించవద్దని నిర్ణయించుకొన్నాను అని ఆమె చెప్పింది.

ప్రస్తుతం ఇటలీలో బ్లూ బికినీతో

అలా వివాదాల్లోను, సెన్సేషనల్ వ్యవహారంలో కేంద్ర బిందువుగా మారే హాట్ ఫిగర్ ప్రస్తుతం ఇటలీలోని టస్కానీ ప్రాంతంలో విహార యాత్ర చేస్తున్నది. అక్కడ బికినీ వేసుకొన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్లూ బికినీ ధరించి సముద్రంలో డైవింగ్ చేస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఒక్క రోజులోనే దాదాపు 250000 మంది వీక్షించారు. ఆ వీడియోను ఓ సారి లుక్కేయండి..

English summary
many would not even know that Radhika is married to a British musician Benedict Taylor. According to reports, the Radhika Apte met Benedict, a London-based musician in 2011 when she had gone to learn contemporary dance. Her friend Sarang Sathay told the daily, "Yes, they had a registered marriage a month ago. It was a quiet, private function. They were living together for a long time and they got married to sort their visas and other documentations."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu