»   »  ఐశ్వర్య, నేను బద్ధశత్రువులం.. పెండ్లికి కూడా పిలువలేదు!

ఐశ్వర్య, నేను బద్ధశత్రువులం.. పెండ్లికి కూడా పిలువలేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో ఐశ్వర్యరాయ్, రాణీ ముఖర్జీలు మంచి స్నేహితులు. సినీతారలు ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ కాలేరు అనే వాదనకు తెరదించే విధంగా వారి మధ్య స్నేహం ఉండేది. కానీ ఒక్క ఘటన వారి జీవితాలు, వారి అనుబంధంపై తీవ్ర ప్రభావం చూపింది. అనాటి మధురస‌ృతులను, చేదు అనుభవాలను ఇటీవల రాణీ ముఖర్జీ గుర్తు చేసుకొన్నది.

 ఐశ్వర్య, రాణీ ముఖర్జీల మధ్య విభేదాలు

ఐశ్వర్య, రాణీ ముఖర్జీల మధ్య విభేదాలు

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, ఐశ్వర్యల మధ్య ప్రేమాయణం జోరుగా సాగుతున్న రోజులవి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో ఐశ్వర్య నటిస్తున్న చల్తే చల్తే సినిమాలో నటిస్తున్నది. ఆ షూటింగ్‌కు వెళ్లి సల్మాన్ ఖాన్ సెట్టింగులను ధ్వంసం చేశాడు. దాంతో ఐశ్వర్యను ఆ చిత్రం నుంచి తొలగించి ఆమె స్థానంలో రాణీ ముఖర్జీని తీసుకొన్నారు. ఆ సందర్భంగా షారుక్‌పై ఐశ్వర్య మండిపడింది. ఈ సంఘటనే ఐశ్వర్య, రాణీలను విడదీసింది. బద్ధశత్రువులుగా మార్చేసింది.

 రాణి ముఖర్జీకి ఆహ్వానం అందని తీరు..

రాణి ముఖర్జీకి ఆహ్వానం అందని తీరు..


బాలీవుడ్‌లో ఆన్‌స్క్రీన్ కపుల్‌గా రాణీ, అభిషేక్ మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో అభిషేక్ బచ్చన్‌తో రాణీ ముఖర్జీ మ్యారేజ్ పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోవడం బాలీవుడ్‌ను షాక్ గురిచేసింది. అయితే రాణీ ముఖర్జీ కాదని అభిషేక్ ఐశ్వర్యను వివాహం చేసుకోవడం అగ్రతారల మధ్య మరింత ఎడబాటుకు గురిచేసింది. అంతేకాకుండా తమ పెళ్లికి రాణీ ముఖర్జీకి శుభలేఖను పంపకపోవడం రాణీని కుంగదీసింది.

 పెండ్లికి పిలువకపోవడం అభి ఇష్టం..

పెండ్లికి పిలువకపోవడం అభి ఇష్టం..


అభిషేక్ తన పెళ్లికి పిలువకపోవడం ఆయన తప్పు. అలా ట్రీట్ చేసిన వ్యక్తి స్థానం ఎక్కడ పెట్టుకోవాలో తెలుసు. ఫ్రెండ్స్‌కు ఇచ్చే విలువ అది గుర్తు చేసింది. దాని వల్ల నాకు ఒరిగిందేమీ లేదు. పెళ్లికి ఎవరిని పిలువాలో.. పిలువొద్దో వారి అంతర్గత విషయం అని రాణీ ముఖర్జీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది.

 ఆదిత్యను పెళ్లాడిని రాణీ ముఖర్జీ

ఆదిత్యను పెళ్లాడిని రాణీ ముఖర్జీ


ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన రాణీముఖర్జీ ప్రముఖ దర్శకుడు ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకొన్నది. ఆమె కూడా అతికొద్ది సన్నిహితులను పెండ్లికి ఆహ్వానించింది. వీరి వివాహాం ఇంటిమేట్ డెస్టినేషన్ మ్యారేజ్‌గా జరిగింది. ఈ పెండ్లికి పిలువని జాబితాలో అభిషేక్, ఐశ్వర్యలు ఉండటం ఆశ్చర్యానికి గురిచేయలేదు.

English summary
There was a time when Aishwarya Rai Bachchan and Rani Mukerji were best buddies. But soon things took a different turned after Salman Khan's incident in Chalte Chalte Shooting.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu