»   » అల్లు అర్జున్ వరుడు పబ్లిసిటీ లో కొత్త తలనొప్పి....?

అల్లు అర్జున్ వరుడు పబ్లిసిటీ లో కొత్త తలనొప్పి....?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ రూపొందించిన వరుడు చిత్రానికి సంభదించి ఇస్తున్న ఎడ్వర్టైజమెంట్ లో కొత్త సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ విధించిన నియమనిభందలు పట్టించుకోకుండా పబ్లిసిటీ చేయటం ఇబ్బందులుకు గురి చేసేటట్లు ఉంది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారి గైడ్ లైన్స్ ప్రకారం ప్రిట్ లో క్వార్టర్ పేజీ యాడ్ ని మించి ఇవ్వకూడదు. అలాగే ఆ యాడ్స్ కూడా లిమిటెడ్ గా ఉండాలి. అయితే దానయ్య (వరుడు చిత్ర నిర్మాత) కళామందిర్ వారితో టై అప్ పెట్టుకుని ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు. అయితే కళామందిర్ యాడ్ క్రింద దాన్ని డిజైన్ చేసారు. కలర్ లో ఈ యాడ్ విలువ మూడున్నర లక్షలు. కళామందిర్ అధినేత కళ్యాణ్ ఈ విషయమై మాట్లాడుతూ..అల్లు అర్జున్ ని ఓ మోడల్ గా తమ వెడ్డింగ్ కలెక్షన్స్ పబ్లిసిటీకోసం పబ్లిసిటీ చేసుకున్నామని చెప్పారు. అయితే నిర్మాతల మండలి దీనిని నిబంధనలు అతిక్రమించటంగానే భావిస్తోంది. దాదాపు ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే యాడ్స్ ఫుల్ పేజీలో ఇవ్వటం,వరుడు సినిమా గురించి ఉండటంతో ఇది సినిమాకి సంభందించిందే అంటోంది. అయితే దీనిమీద ఏ యాక్షన్ తీసుకుంటారు అనేది ఇంకా నిర్ణయం కాలేదు. కొందరు మాత్రం ఇది ఒక ట్రెండ్ అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాక్షన్ తీసుకోకపోతే అందరూ అలాగే టైఅప్ పెట్టుకుని ఫుల్ ఫేజీ యాడ్స్ ఇస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక వరుడు చిత్రం రేపు రిలీజ్ అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu