»   » ‘ఎఫైర్’సెన్సార్ పూర్తయింది

‘ఎఫైర్’సెన్సార్ పూర్తయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం "ఎఫైర్". ఇద్దరు అమ్మాయిల ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గీతాంజలి, ప్రశాంతి కీలకపాత్రలు పోషించారు. శ్రీరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... "బాలీవుడ్ లో మహేష్ భట్ రూపొందించే చిత్రాల కోవలో తెరక్కిన చిత్రం "ఎఫైర్". అసభ్యతకు తావు లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ విధంగా మా దర్శకుడు శ్రీరాజన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. మా "ఎఫైర్" చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.

Affair censor completed

చిత్ర దర్శకుడు శ్రీరాజన్ మాట్లాడుతూ... "ప్రేమకు హద్దు లేదు అని షేక్ స్పియర్ చెప్పిన మాటను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. గీతాంజలి-ప్రశాంతిల నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా నిర్మాత రామసత్యనారయణగారు అందించిన సహకారంతో క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించగలిగాను. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం" అన్నారు.

ధనరాజ్, సాయిరాజ్, రాకేష్, శాని సాల్మోన్, పుచ్చా రామకృష్ణ, హరిత, ఫణి, సంపత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సంగీతం: శేషు కె.ఎం.ఆర్, ఎడిటింగ్: సోమేశ్వర్ పోచం, కెమెరా: కర్ణ ప్యారశాని, డిఐ-వి.ఎఫ్.ఎక్స్: రఘు (మహామాయ), డైలాగ్స్: అనిల్ సిరిమల్ల, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజన్!

English summary
Affair censor completed. Tummalapalli Rama Satyanarayana is producing a movie titled 'Affair' which has Prashanthi, Geethanjali, Dhanraj, Rakesh, Sairaj, Pucha Ramakrishna etc playing important roles. Srirajan directed the film.
Please Wait while comments are loading...