»   » పదిహేనేళ్ల తర్వాత సెకండ్ షో: జాతీయ అవార్డ్ తెలుగు సినిమా గుర్తుందా..?

పదిహేనేళ్ల తర్వాత సెకండ్ షో: జాతీయ అవార్డ్ తెలుగు సినిమా గుర్తుందా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కృష్ణ కూతురు మంజుల నటించి, నిర్మించిన షో గుర్తుందా? ఉత్తమ ప్రాంతీయ చిత్రం పురస్కారమే కాదు.. ఏకంగా ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలోనూ జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన సినిమా 'షో'. ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో దర్శకుడు నీలకంఠ పేరు చర్చనీయాంశమైంది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో "మిస్సమ్మ" తప్ప మిగతావి ఏవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు తన తొలి అవార్డ్ సినిమా "షో" కి సీక్వెల్ తీయ బోతున్నాడట నీలకంఠ...

రెండే రెండు క్యారక్టర్స్‌ తో

రెండే రెండు క్యారక్టర్స్‌ తో

2001 లోవచ్చిన షో" చిత్రం పూర్తిగా టెక్నీషియన్స్‌ చిత్రం. మెలోడ్రామా, సినిమాటిక్‌ అంశాలు లేకుండా..కేవలం సినిమాను ఒక 'షో'లా చూడదగ్గట్లు దర్శకుడు నీలకంఠ రూపొందించాడు. రెండే రెండు క్యారక్టర్స్‌ తో రెండు గంటల పాటు సినిమాను రూపొందించడం అంటే చాలా కష్టం. అదీ బోర్‌ కొట్టకుండా తీయడం అంటే పెద్ద సాహసం.

 రెండు పాత్రలతో సినిమా

రెండు పాత్రలతో సినిమా

కానీ ఈ షోలో మనకు ఎక్కడా బోర్‌ కొట్టదు కదా..సినిమాలో రెండే పాత్రలున్నాయన్న విషయం కూడా తోచదు. ఆ విధంగా స్క్రీన్‌ ప్లే రూపొందించిన నీలకంఠ నిజంగా అభినందనీయుడు. అయితే, రెండు పాత్రలతో సినిమా తీస్తున్నప్పుడు అందరి కన్నా అధికంగా కష్టపడేది సినిమాటోగ్రఫరే. ఎందుకంటే ఈ సినిమా అంతా ఒక ఇంట్లో..ఆ ఇంటి ఆవరణలో..చుట్టుపక్కల పరిసరాల్లోనే..తీశారు.

అద్భుతమైన కెమెరా

అద్భుతమైన కెమెరా

ఇలాంటి పరిమిత లోకేషన్స్‌, సబ్జెక్ట్స్‌ తో రెండు గంటల పాటు ప్రేక్షకులను బోర్‌ కొట్టించకుండా తీయాలంటే...ఫోటోగ్రఫర్‌ తన ఇమేజినేషన్‌ కు పనిచెప్పకతప్పదు. రవియాదవ్‌ అడవి బ్యాక్‌ డ్రాప్‌ ను, జంతువులను...ఉపయోగించుకొని ..అద్భుతమైన కెమెరా పనితనంతో ఈ సినిమాకు సంపూర్ణన్యాయం చేశాడు.

కృష్ణ కూతురు మంజుల

కృష్ణ కూతురు మంజుల

ఇక కృష్ణ కూతురు మంజుల తొలి చిత్రంలోనే మంచి నటినని నిరూపించుకొంది. చాలా సహజంగా, తన వయసుకు తగ్గట్లు నటించింది. జీవితంలో ఓడిపోయి, ప్రస్టేషన్‌ తో గడుపుతున్న పాత్రలో సూర్య అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. డైలాగ్‌ సరిగా సింక్‌ కాకపోవడం వంటి చిన్న లోపాలను పక్కన పెడితే, ఈ సినిమా అప్పట్లో మంచి చిత్రం. చక్కటి ప్రయోగం.

తాళం వేసిన ఇళ్ళే

తాళం వేసిన ఇళ్ళే

తెలుగులో సరికొత్త చిత్రం. మంజుల ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో మేనేజర్‌. మదనపల్లి అడవుల్లో క్యాన్సర్‌ కు మందును కనుక్కొన్న ఓ ప్రొఫెసర్‌ దగ్గరికి ఢిల్లీ నుంచి వస్తుంది. ఆయన ఇల్లు అడవిలో దూరంగా విసర్జించినట్లుగా ఉంటుంది. ఉదయాన్నే వచ్చిన ప్రొఫెసర్‌ ఇంటికి వచ్చిన మంజులకు తాళం వేసిన ఇళ్ళే ఆహ్వానం పలుకుతుంది.

నాలుగు గంటల్లో

నాలుగు గంటల్లో

పక్క ఊరికి పనిమీద అర్జెంట్‌ గా వెళుతున్నాను, నాలుగు గంటల్లో వచ్చేస్తాను..అప్పటివరకు వెయిట్‌ చేయమని ఒక లెటర్‌, తాళం పెట్టి వెళతాడు. పేటేంట్‌ ఒప్పందాలను చూసేందుకు జూనియర్‌ లాయర్‌ సూర్య కూడా ఇంటికి ఉదయాన్నే వస్తాడు. ప్రొఫెషర్‌ ఇంట్లో లేడని తెలిసి చిరాకు పడిపోతాడు.

అపరిచితులు ఇద్దరూ

అపరిచితులు ఇద్దరూ

చేసేదేమీ లేక ఈ అపరిచితులు ఇద్దరూ ఈ ఇంట్లో ఒక దినమంతా గడపేందుకు సిద్దమవుతారు. అడవిలో ఎటువంటి మానవ సంచారం, కాలక్షేపానికి ఏమీ లేని ఆ ఇంట్లో వారు ఎలా టైంపాస్‌ చేస్తారు? టైంపాస్‌ కోసం వారు ఆడిన ఓ నాటకం..ఇద్దరి జీవితాల్లోని మరో కోణాన్ని ఆవిష్కరింపచేయడంతో...సినిమా ముగుస్తుంది.

‘షో' సీక్వెల్

‘షో' సీక్వెల్

15 ఏళ్ల కిందట దర్శకుడిగా తనకు లైఫ్ ఇచ్చిన ‘షో' సినిమాకు సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ చిత్రానికి ‘సెకండ్ షో' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. నటుడు.. దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ చిత్రానికి తన వంతు సహకారం అందిస్తుండటం విశేషం.

త్వరలోనే పూర్తి వివరాలు

త్వరలోనే పూర్తి వివరాలు

స్క్రిప్ట్ వర్క్ లో సాయం చేయడమే కాదు.. ఆ సినిమాలో అవసరాల ఓ కీలక పాత్ర పోషించే అవకాశాలు కూడా ఉన్నాయట. త్వరలోనే ఈప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయి. ఈ సినిమాతో మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాలని భావిస్తున్నాడు నీలకంఠ.

English summary
Almost 15 years after the release, the Telugu film that won two National awards and high critical acclaim is getting ready to have its sequel. Going by the latest reports from the industry, the 2002 film 'Show', directed by the highly talented Neelakanta, is most likely to have a follow-up titled 'Second Show' soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu