»   » నీవు గర్భవతివి.. నాకొద్దు పో.. ఐశ్వర్యరాయ్‌కి డైరెక్టర్ షాక్

నీవు గర్భవతివి.. నాకొద్దు పో.. ఐశ్వర్యరాయ్‌కి డైరెక్టర్ షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న రోజుల్లో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌కి ఓ చేదు అనుభవం ఎదురైంది. తాను రూపొందించే చిత్రం నుంచి ఐష్‌ను చెప్పా పెట్టకుండా దర్శకుడు మధుర్ బండార్కర్ తొలగించడం బాలీవుడ్ చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా చర్చనీయాంశమైంది. తను గర్భం దాల్చిన విషయం నాకు చెప్పకుండా దాచిందని ఐష్‌పై మధుర్ బండార్కర్ బహిరంగంగానే నిప్పులు చెరిగారు. ఆ సంఘటన అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఆ ఘటన గురించి ఇటీవల మధుర్ బండార్కర్ వివరించారు.

  వాస్తవానికి ఐశ్వర్య హీరోయిన్

  వాస్తవానికి ఐశ్వర్య హీరోయిన్

  బాలీవుడ్‌లో హీరోయిన్ అనే సినిమాను తీయాలని దర్శకుడు మధుర్ బండార్కర్ నిర్ణయించుకొన్నాడు. ముందుగా ఐశ్వర్యరాయ్‌ను కథా నాయికగా అనుకొన్నాడు. వారి మధ్య అవగాహన కూడా కుదిరింది. హీరోయిన్ అనే పాత్ర చేయడానికి ఐష్ ఒప్పుకోవడం, ఆ తర్వాత అగ్రిమెంట్ పేపర్లపైనా సంతకాలు చేయడం జరిగిపోయాయి. అయితే ఐష్‌కు తెలియజేయకుండా ఆ చిత్రం నుంచి ఆమెను తొలగించడం సంచలనం రేపింది.

  నా అంతరాత్మకు తెలుసు

  నా అంతరాత్మకు తెలుసు

  ఆ రోజు ఐశ్వర్యను తొలగించిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను నిజాయితీగా వ్యవహరించాను. ఆఎందుకంటే ఆ వాస్తవం నా అంతరాత్మకు తెలుసు. నేను నమ్ముకున్న వృత్తికి కట్టుబడి ఆ పని చేశాను. ఆ చిత్రం నా డ్రీమ్ ప్రాజెక్ట్. దాని గురించి దాదాపు ఏడాదిన్నర పాటు నానా కష్టాలు పడ్డాను.

  మాతృత్వం విలువ తెలుసు

  మాతృత్వం విలువ తెలుసు

  హీరోయిన్ సినిమా నా జీవితంలో చాలా ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్. మాతృత్వం అనుభూతి పొందడం ఎవరికైనా గొప్ప విషయం. అలాంటి అనుభూతి పొందే ఏ స్త్రీకి అయినా నేను చేతులెత్తి నమస్కరిస్తాను. కష్టకాలంలో నాకు అండగా నిలిచేది నా ఇంట్లో మహిళలే. నా గెలుపు ఓటముల వెనుక నా భార్య, సోదరి, తల్లి, కూతురు ఉంటారు.

  చాలా ఉద్వేగమైన కథ

  చాలా ఉద్వేగమైన కథ

  హీరోయిన్ అనే సినిమా సాధారణమైన చిత్రం కాదు. చాలా మంది యాక్టర్లతో పలు ప్రదేశాల్లో చిత్రీకరించే సినిమా అంది. ఆ సినిమాను దాదాపు 40 లోకేషన్లలో చిత్రీకరించాలని ప్లాన్ చేశాం. చాలా సీన్లలో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు. భారమైన సన్నివేశాలు ఉంటాయి. కొన్నిసార్లు హీరోయిన్ చుట్టు చాలా మంది చుట్టుముడుతారు. అడల్డ్ కంటెంట్ ఉంటుంది. ఎక్కువగా డ్యాన్సులు, పాటలు ఉంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది.

  ఆ విషయం తెలిసి..

  ఆ విషయం తెలిసి..

  హీరోయిన్‌ చిత్రంలో భావోద్వేగమైన సన్నివేశాలు ఉంటాయి. ఒకే సీన్ 8 రోజులు చిత్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఓ సీన్‌లో టెర్రస్ మీద రిహార్సల్ చేస్తున్న అసోసియేట్ డైరెక్టర్ కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అదే పరిస్థితుల్లో ఐశ్వర్య ఉంటే నా జీవితం చాలా దుర్భరంగా మారేది. అదే సమయంలో ఐష్ గర్బవతి అనే విషయం తెలిసింది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఐష్‌ సరికాదు అనిపించింది.

  మద్యం, సిగరెట్ తాగాల్సి ఉంటుంది..

  మద్యం, సిగరెట్ తాగాల్సి ఉంటుంది..

  ఈ చిత్రంలో హీరోయిన్ మద్యం సేవించాలి. పొగతాగాలి. కెమెరా ముందు చాలా పనులు చేయాల్సి ఉంటుంది. చుట్టుపక్కల జనం కూడా పొగతాగుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో గర్భవతి అయిన ఐష్ ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి ఉండేది. అప్పటికే మీడియా అంతా ఐష్ గర్భవతి అని గగ్గోలు పెడుతుంది. నవంబర్‌లో డెలివరీ డేట్ చెప్పుకొంటున్నారు.

  పర్వతం మీద పడి కూలినట్టు

  పర్వతం మీద పడి కూలినట్టు

  ఐశ్వర్య గర్భవతి అనే విషయం తెలియగానే ఓ పెద్ద పర్వతం కూలి మీద పడినట్టు అనిపించింది. చాలా నిరాశకు గురయ్యాను. సినిమాలో ఏడు నెలల గర్భవతిగా ఐశ్వర్యను చూపించలేముగా. తెరమీద ఓ అందమైన హీరోయిన్ గర్భంతో ఉంటే ఎలా ఉంటుంది.

  అందుకే తొలగించాను

  అందుకే తొలగించాను

  ఇలాంటి పరిస్థితులు అన్ని ఆలోచించిన తర్వాతే ఐశ్వర్య వద్దని అనుకొన్నాం. అయితే గర్భవతి అనే విషయాన్ని దాచిపెట్టడంతో నాకు చాలా కోపం వచ్చింది. నా జీవితాన్ని పణంగా పెట్టి తీస్తున్న ఈ చిత్రానికి ఆమె సరికాదు.. ఆమె తీరుపై ఆగ్రహం కలిగింది. అందుకే కోపంతో ఐశ్వర్యను తొలగించాను. ఆమె స్థానంలో కరీనాను తీసుకొన్నాను అని మధుర్ బండార్కర్ చెప్పారు.

  English summary
  It was one of the biggest controversies in the history of Bollywood, when Madhur Bhandarkar threw Aishwarya Rai Bachchan out of his film for hiding her pregnancy news. The director also took many indirect digs at Aishwarya Rai Bachchan and termed her greedy. Those who don't know Aishwarya was the first choice for Madhur Bhandarkar's movie Heroine and the actress had signed the movie, without informing him about his pregnancy. Read what Madhur had revealed to the media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more