»   » విలన్ నిరాశ పరిచాడు-రోబో ఆశ్చర్య పరిచాడు..!

విలన్ నిరాశ పరిచాడు-రోబో ఆశ్చర్య పరిచాడు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల సుందరి ఐశ్వర్య రాయ్ ఆనందంతో తబ్బిబ్బయిపోతోంది. తన పాలిట 'విలన్" గా మారిన 'రావణ్" సినిమా మిగిల్చిన నిరాశ నుంచి విముక్తి కలిగించి..'రోబో" విజయం మంచి ఉత్తేజాన్ని ఇస్తోంది ఐశ్వర్యకు. గత కొంతకాలంగా హిట్ సినిమాలకోసం అర్రులు చాచిన ఐశ్వర్య కు ఈ చిత్రం కొత్త ఊపిరిని పోసింది.'జోదా అక్బర్" చిత్రం తర్వాత ఐశ్వర్య కెరీర్ లో చెప్పుకోదగిని చిత్రాలేమీ లేకపోవడంతో ఇటీవల కొంత నిరుత్సాహంతో ఉంది.

పైగా 'రావణ్‌' సినిమా ఫెయిల్యూర్‌ తో రేస్‌లో వెనకబడిపోయింది ఐశ్వర్య. ఇక ఐసు పని అయిపోయింది అని అనుకున్నవారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఐశ్వర్య దూసుకుపోతోంది. పైగా మరో రెండు లేక మూడు చిత్రాల తర్వాత ఇక పిల్లలను కనాలనుకుంటున్నానని...అప్పటిదాకా కమిట్‌ అయిన చిత్రాలనే చేస్తానని స్టేట్‌ మెంట్‌ సైతం ఇచ్చేసిన ఐశ్వర్యకు సరైన సమయంలో 'రోబో' హిట్‌ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనడంలో సందేహం ఎంతమాత్రం లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu