Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డిస్కషన్ లో అక్కినేని అఖిల్ ట్వీట్
హైదరాబాద్ : అఖినేని అఖిల్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వకముందే సెలబ్రెటీ. దాంతో అతను సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో ఏది రాసినా డిస్కషన్ కు దారితీస్తోంది. రీసెంట్ గా అఖిల్ తాను ఓల్డ్ సిటీలో రాత్రిపూట తను షూటింగ్ చేసానంటూ, షూటింగ్ బాగా నచ్చిందని దానికి కారణం తన అద్బుతమైన దర్శకుడేనని రాసుకొచ్చి, అక్కడ ఫొటో ఒకటి తీసి ట్వీట్ చేసారు. మీరు ఇక్కడ చూస్తున్నది ఆ ఫొటోనే.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఓల్డ్ సిటీలో ఫైట్ తో ప్రారంభించారనగనే ...ఇదేంటి ఇంకా కథ రెడీ కాలేదా అని సందేహాలు వెళ్లబుచ్చుతున్నారు. అయితే టాలీవుడ్ లోని కొందరు మాత్రం... వినాయిక్ సెంటిమెంట్ తో ఈ ఫైట్ సీన్ తో షూటింగ్ ప్రారంభించాడని,గతంలో నాయిక్ చిత్రానికి సైతం ఇక్కడే ఇలాగే ప్రారంభం ఓల్డ్ సిటీలో నైట్ ఎఫెక్ట్ ఫైట్ తో ప్రారంభించాడని చెప్తున్నారు. కథ చాలా బాగా వచ్చిందని,సోషియో ఫాంటసీ అని అంటున్నారు.
అఖిల్ అక్కినేని హీరోగా పరిచయమవుతున్న సినిమా చిత్రీకరణ మొదటి రోజే ఫైట్ సీన్స్ తో మొదలైంది. అక్కడ ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో ఫైట్ మాస్టర్ రవి నేతృత్వంలో అఖిల్ తదితరులపై ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు.

అఖిల్ సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకుడు. ఈ చిత్రంలో అఖిల్ తండ్రి పాత్ర కోసం రాజేంద్రప్రసాద్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సుధాకర్ రెడ్డి, నితిన్ నిర్మాతలు.
మనం సినిమాతో అఖిల్‌ను పరిచయం చేయాలనే ఆలోచన నాన్నగారిదే. తను ఎక్కువ రోజులు బతకననే నాన్న ఉద్ధేశ్యంతోనే అఖిల్ అరంగేట్రం ఆలోచన పుట్టింది.ఇలాంటి శుభతరుణంలో ఆయన మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం అని అన్నారు నాగార్జున.
దర్శకుడు కె.రాఘవేంద్రరావు, హీరో వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తగా పరిచయం అవుతున్న హీరో అఖిల్ ని మంచి విజయం సాధించాలని ఆశ్వీరదించారు. నితిన్ నిర్మాతగా.. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వివి వినాయిక్ మాట్లాడుతూ...''నాగార్జునగారు నాపై పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమా. 'మనం'లో అఖిల్‌ను చూడగానే అందరిలా నేనూ షాక్‌కు గురయ్యా. అంత బాగా నచ్చేశాడు. ఎంత నచ్చాడో ఈ చిత్రంలో చూపిస్తాను.వంద శాతం కష్టపడే సాంకేతిక బృందం కుదిరింది. ప్రతి ప్రేక్షకుడికీ నచ్చేలా అఖిల్‌ను తెరపై చూపిస్తానని మాటిస్తున్నాను''అన్నారు వి.వి.వినాయక్.

వెంకటేష్ మాట్లాడుతూ... ''అఖిల్ రూపంలో ఒక కొత్త స్టార్ రాబోతున్నాడు. ఇక అక్కినేని అభిమానులకు పండగే. అఖిల్ ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తాడు. వినాయక్ దర్శకత్వంలో తెరంగేట్రం అవ్వడం ఆనందంగా ఉంది''అన్నారు.
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ... ''విక్టరీ మధుసూదనరావుగారి చేతుల మీదుగా తెరకు పరిచయమయ్యారు నాగార్జున. ఒక 'వి' ఉన్న దర్శకుడి చేతులమీదుగా పరిచయమైన నాగార్జున మంచి పేరు తెచ్చుకొన్నాడు. మూడు 'వి'లు ఉన్న వినాయక్ చేతులమీదుగా పరిచయమవుతున్న అఖిల్ మరింత పేరు తెచ్చుకొంటాడు''అన్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ... ''ఈ రోజు కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా. సినిమా అంటే అఖిల్‌కు ప్రాణం. తాను చేసే ప్రతి సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుందన్న నమ్మకముంది. దేశంలోని సినిమా అభిమానులందరినీ ఆకట్టుకొంటాడన్న నమ్మకముంది''అన్నారు.
నితిన్ మాట్లాడుతూ... ''ప్రతిష్ఠాత్మకమైన ఈ సినిమాకు నేను నిర్మాత కావడం ఆనందంగా ఉంది. నాగార్జునగారు మాపై పెట్టుకొన్న నమ్మకాన్ని నెరవేర్చుతాం. ఆయన చేసిన ప్రేమకథా చిత్రాలు 'గీతాంజలి', 'నిన్నే పెళ్లాడతా'.. మాస్ సినిమాలు 'శివ', 'మాస్' కలిపితే ఎలా ఉంటుందో అఖిల్ చేసే ఈ సినిమా అలా ఉంటుంది''అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ...''అఖిల్‌ను 'మనం' రూపంలో నాన్న ఆశీర్వదించారు. అఖిల్‌కు సూపర్ హిట్ సినిమా ఇస్తామని వినాయక్, నితిన్ మాటిచ్చారు. ఈ కథ నేనూ విన్నాను. చాలామంది ఇదొక ప్రేమకథ అనుకొంటున్నారు. అది నిజం కాదు. సినిమా నిండా మాస్ అంశాలు ఉన్నాయి''అన్నారు నాగార్జున.
అమల మాట్లాడుతూ....''అందరిలాగే అఖిల్ సినిమా గురించి నేనూ ఎదురు చూస్తున్నా. మా అబ్బాయిని అభిమానుల చేతుల్లో పెడుతున్నాను''అన్నారు.
అఖిల్ మాట్లాడుతూ.... ''ఈ సమయంలో తాతగారు ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఆయన అభిమానుల్లోనే దేవుడిని చూసుకొనేవారు. అభిమానులు ఎంతో ఇస్తారు. మేం తిరిగి వాళ్లకు హిట్ సినిమా తప్ప ఏం ఇవ్వగలం. ఎలాగైనా హిట్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకొన్నా. దాని గురించే ఆలోచిస్తూ నాన్నను అడిగేవాణ్ని. అప్పుడు చీకట్లో ఉన్న నాకు ఒక సెర్చ్‌లైట్‌లా కనిపించారు వి.వి.వినాయక్‌గారు. ఇలాంటి సినిమాకు వినాయక్‌గారే దర్శకత్వం వహించాలని నాకనిపించింది.
అలాగే...కేవలం అభిమానుల కోసమే తొలి సినిమా చేయాలని నితిన్ చెబుతూ ఉండేవాడు. ఆయన నా సినిమాకు నిర్మాత కావడం ఆనందాన్నిచ్చింది. ఇందులో యాక్షన్, డ్యాన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. మూడు నాలుగేళ్లుగా డ్యాన్స్ నేర్చుకుంటున్నా. అందరికీ నచ్చేలా తెరపై కనిపిస్తా. ఈ సినిమాకు తమన్, అనూప్ రూబెన్స్ కలసి సంగీతం అందిస్తారు''అన్నారు.
నేను ఈ స్థాయికి చేరుకోవటానికి అమ్మనాన్నలే ముఖ్య కారణం. అన్నయ్య నాగచైతన్య ఇంత ఎమోషనల్ మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. భవిష్యత్‌లో మేమిద్దరం కలిసి ఓ పెద్ద మల్టీస్టారర్ సినిమా చేస్తాం అన్నారు అఖిల్.