»   » ఫ్లాప్ ముంగిట్లో నాగార్జున..!? అదే సెంటిమెంట్ మళ్ళీ రిపీటా??

ఫ్లాప్ ముంగిట్లో నాగార్జున..!? అదే సెంటిమెంట్ మళ్ళీ రిపీటా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓం కార్ ఇదివరకే తీసిన రాజు గారి గది కి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నడన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ముందు విక్టరీ వెంకటేష్ హీరో అని ప్రచారం జరిగింది. వెంకీ కూడా ఓంకార్‌తో చర్చలు జరిగినట్లు చెప్పాడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. వెంకీ ప్లేస్‌లోకి నాగార్జున వచ్చాడు. మ‌నం-ఊపిరి-సోగ్గాడే చిన్ని నాయ‌నా ఇలా మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాల‌తో మంచి ఊపుమీద ఉన్నాడు కింగ్ నాగార్జున . ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓం న‌మో వెంక‌టేశాయా అనే భ‌క్తిర‌స చిత్రంతో ఈ రోజు థియేటర్లలో అడుగుపెట్టిన నాగ్ నాగ్ ఇప్పుడు హార్రర్‌ కామెడీ చిత్రానికే ఓటు వేసేసాడు.

అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఇప్పటి వరకూ నాగార్జున ఏ భక్తి రస చిత్రం లో నటించినా దాని తర్వాత వచ్చే సినిమా పక్కాగ అట్టర్ ఫ్లాప్ అయి తీరుతుందనేది ఇప్పటివరకూ ఉన్న రికార్డ్ లిస్ట్ చెబుతోంది. ఓమ్ నమో వేంకటేశాయ అంటూ హాథీరామ్ బాబా గా ఇంకొన్ని గంటలలో బయటికి రానున్నాడు నాగార్జున. ఈ సినిమా ఫలితం ఏమిటన్నదీ కాసేపట్లో తెలిసి పోతుంది. అయితే నాగ్ అభిమానుల్లో ఇప్పుడు ఉన్నది ఈ సినిమా గురించిన ఆలోచన కాదు. రాబోయే సినిమా గురించే. అదేమిటంటారా.... ఒక్కసారి ఇది చదివితే ఆ విషయం అర్థమవుతుంది

హర్రర్ కామెడీ హవా :

హర్రర్ కామెడీ హవా :

ఈ మధ్య బాలీవుడ్ లో బయో పిక్ ఒక ట్రెండ్ గా మారితే.., దక్షిణాదిలో ఇటు తెలుగూ అటు తమిళ్ పరిశ్రమ లో కూడా హర్రర్ కామెడీ హవా సాగుతోంది. మొన్నటి వరకూ కేవలం చిన్న దర్శకులూ, చిన్న హీరోలతో తక్కువ బడ్జెట్ లోనే మినిమం గ్యారెంటీ నుంచీ ఒక మోస్తరు లాభాలను కూడా తెచ్చి పెట్తింది ఈ నవ్వుల దయ్యాలే....

రొటీన్ కామెడీ:

రొటీన్ కామెడీ:

కామెడీ అనే జోనర్ ని పిండుకోవాల్సినంత పిండుకున్నారు కనీసం ఒక పదేళ్ళ పాటు కామెడీజోనర్లొ వచ్చిన సినిమాలు చిన్న నిర్మాతల పాలిటి వరంగా మారాయి. అయితే ఇక వరుస కామెడీలకు కొత్తగా కథలు తగ్గిపోవటం... రొటీన్ కామెడీ ప్రేక్షకులకు బోరు కొట్టట్టటమే కాకుండా...

జబర్దస్థ్ లాంటి కామెడీ షో:

జబర్దస్థ్ లాంటి కామెడీ షో:

టీవీల్లోనూ జబర్దస్థ్ లాంటి కామెడీ షోలు కూడా ఒకరకంగా కామెడీ సినిమాల మీద గట్టి దెబ్బే వేసాయి. ఇక దాంతో లాభం లేదనుకుని హిట్ సినిమా స్పూఫ్ లతోనే నవ్వించే ప్రయత్నం చేసి "సుడిగాడు" తో హిట్ కొట్టాడు అల్లరి నరేష్, వెంటనే సంపూర్నేష్ బాబు హీరో గా వచ్చిన సింగం 123 కూడా అదే తరహాలో వచ్చి ప్రేక్షకులని ఆకటుకుంది.

 ప్రయోగాత్మకంగా:

ప్రయోగాత్మకంగా:

అయితే ఈ ట్రెండు కూడా ఎక్కువ కాలం సాగదని "సెల్ఫీ రాజా తో" అర్థమైపోయింది. దాంతో ఇక ఎవర్ గ్రీన్ హిట్ ఫార్ములా ల్లో రెండోదైన హర్రర్ ని ట్రై చేసి చూద్దం అనౌకున్నారు కానీ త్రిపుర లాంటి సినిమాలు ఇచ్చిన అనుభవం తో ఇక అంతకుముందు ఒకటీ రెండుసారి ప్రయోగాత్మకంగా చూసిన హర్రర్ కామెడీ ని పట్టుకున్నారు

 నాగార్జున కూడా:

నాగార్జున కూడా:

ప్రేమ కథా చిత్రం నుంచీ ఈ హర్రర్ కామెడీ హవా మొదలై... నెమ్మది నెమ్మది గా తన సత్తా నిరూపించుకుంది. ఇప్పుడు ప్రభుదేవా.., తమన్నా లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న నటులు కూడా ఈ జోనర్ లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు మరో అడుగుముందుకేసి అగ్ర హీరోల్లో ఒకడైన నాగార్జున కూడా ఒక హర్రర్ కామెడీలో నటించనున్నాడట. అదీ ఓకారన్నయ్య డైరెక్షన్ లో...

 నాగవళ్ళి:

నాగవళ్ళి:

నాగార్జున ఏమిటీ హర్రర్ కామెడీ ఏమిటా అనిపించిందా ..?? అందరికీ అదే అనిపించింది కానీ చంద్రముఖి లాంటి సినిమాతో రజినీ కాంత్ ఏ హిట్ కొట్టాడు కదా అని కొందరంటే, దానికే సీక్వెల్ గా వచ్చిన నాగవళ్ళి మన వెంకటేష్ ని ఏం చేసిందో చూసి కూడా నాగ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా అని ఇంకొందరు అంటున్నారు.

భయంకరమైన సెంటిమెంట్ :

భయంకరమైన సెంటిమెంట్ :

మొత్తానికి రియలిటీ షోల నుంచీ దర్శకుడు వరకూ ఎదిగిన ఓంకార్ ఇప్పుడు నాగ్ ని కూడా డైరెక్ట్ చేస్తే ఇంక దర్శకుడి గా ఒక ఫ్లాట్ఫారం మీదకి ఎక్కేసినట్టే... కానీ నాగ్ కి ఈ సినిమా సూటౌతుందా... అందులోనూ ఒక భయంకరమైన సెంటిమెంట్ రాఘవేంద్రరావు రూపం లో పక్కనే ఉన్న సమయం లో ఇలాంటి హర్రర్ కామెడీ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు అన్నది ఇప్పుడున్న అనుమానం.

ఓంకార్ స్క్రిప్టు మీద ఆసక్తిగా:

ఓంకార్ స్క్రిప్టు మీద ఆసక్తిగా:

పీవీపీ లాంటి పెద్ద సంస్థ ఓంకార్‌తో సినిమాకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆల్రెడీ పీవీపీ బేనర్లో ‘ఊపిరి' లాంటి సినిమా చేసిన నాగ్.. ఓంకార్ స్క్రిప్టు మీద ఆసక్తిగానే ఉన్నాడట. ఐతే ఇంకొంచెం వర్క్ చేయమని చెప్పాడట. త్వరలోనే ఓంకార్-నాగ్ కాంబినేషన్లో సినిమా మొదలు కావచ్చని సమాచారం. ‘రాజు గారి గది'కి సీక్వెల్ అన్నప్పటికీ కథ పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఓంకార్ లాంటి దర్శకుడు నాగార్జునను డైరెక్ట్ చేయడమంటే మామూలు విషయం కాదు. అందులోనూ పీవీపీ బేనర్ ఈ చిత్రాన్ని నిర్మించడం మరింత పెద్ద విశేషమే.

ఇంకా ముఖ్యం:

ఇంకా ముఖ్యం:

అయితే హర్రర్ కామెడీ అనే జోనర్ నాగ్ లాంటి హీరోకి సూటవుతుందా అన్నదే ఇప్పుడున్న ప్రశ్న. అయితే రజినీ కాంత్ లాంటి సూపర్ స్టార్ చేసిన "చంద్రముఖి" ఉంది కదా అనిపించినా... దాని తర్వాత మన తెలుగు స్టార్ విక్టరీ కి అపజయం తెచ్చిన "నాగవళ్ళిని" కూడా చూడాలి. అందులోనూ ఇక్కడ దర్శకుడు "ఓంకారన్నియ్య" అన్న బేసిక్ విశయాన్ని కూడా మనం గమనించాలి కదా... ఇక ఇక్కడ ఇంకా ముఖ్యంగా పట్టించుకోవాల్సిన విశయం ఒకటుంది.

అన్నమయ్య హిట్:

అన్నమయ్య హిట్:

అదేమిటంటే నాగ్-రాగ్-ఆఫ్టర్ ఏ ఫ్లాప్ అని.., ఈ ఫార్ములా ప్రకారం నాగార్జున, రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన భక్తి సినిమా సూపర్ హిట్ అవుతుంది ఆ తర్వాత వెంటనే వచ్చిన హీరో సినిమా అట్టర్ గా ఫట్ అవుతుంది.. అన్నమయ్య సినిమా బంపర్ హిట్ ఆ వెంటనే వచ్చిన "చంద్ర లేఖ" "ఆటో డ్రైవర్" అసలు నాగార్జున ఈ సినిమా తీసాడాలేదా అనే డౌటొచ్చెంత పెద్ద ఫ్లాప్,

జగద్గురు ఆది శంకరాచార్య:

జగద్గురు ఆది శంకరాచార్య:

ఇక ఆతర్వాత శ్రీ రామదాసు మళ్ళీ రాఘవేంద్రుడే... ఆ తర్వాత వచ్చిన "బాస్ ఐలవ్ యూ" మళ్ళీ దేబ్బేసింది. ఇక శిరిడీ సాయి తర్వాత వచ్చిన ఢమరుకం, గ్రీకు వీరుడు ఎమయ్యాయో మళ్ళీ చెప్పాలా?? ఇక్కడ ఈ గ్యాప్ లో చిన్నదే కదా అని జగద్గురు ఆది శంకరాచార్య లో చిన్న "చండాలుడి" పాత్రవేసాడు. అంతే నెక్స్ట్ "భాయ్" బాక్స్ లు బద్దలయ్యాయి.

ఓం నమో వేంకటేశాయ:

ఓం నమో వేంకటేశాయ:

ఈ ఫార్ములా నాగ్ మీద మాత్రమే కాదు శ్రీ మంజునాథ తర్వాత "అంజి" తో చిరంజీవికీ, పాండురంగడు తర్వాత "మిత్రుడు" లతో బాలయ్యకీ ఇదే అనుభవం ఎదురయ్యింది. ఇదే ఫార్ములాని బట్టి చూస్తే సేమ్ నాగ్,-రాగ్ కాంబినేషన్ లో రాబోతున్న ఓం నమో వేంకటేశాయ తర్వాత చేయ బోయే సినిమా... ఈ రాజు గారి రెండో గదే....

ఆల్ దబెస్ట్ నాగ్ అండ్ ఓంకార్ :

ఆల్ దబెస్ట్ నాగ్ అండ్ ఓంకార్ :

మరి అటు ఓం కారన్నయ్య ఒకసారి హిట్ అయిన సబ్జెక్ట్ అంటూ ఆశపెడుతున్నా అసలే రాఘవేంద్ర రావు సినిమా తో వచ్చిన దిష్టి మొత్తం ఈ సినిమాతో పోయినట్టవుతుందనుకుంటున్నాడా నాగార్జున?? ఎటూ సినిమా అన్నది రావాల్సిందే కాబట్టి ఏవరో ఒకరు రిస్క్ చేయల్సిందే.. అందులోనూ ఈ సారి వచ్చే సినిమా హిట్ అనిపించుకుందీ అంటే ఇన్నాళ్ళూ ఉన్న ఒక బ్యాడ్ ముద్ర పోతుందీ... కొన్ని మూడనమ్మకాలకూ తెరదించినట్టూ అవుతుంది సో ఆల్ దబెస్ట్ నాగ్ అండ్ ఓంకార్ గారూ..

English summary
Omkar plans to make a sequel to Raju Gari Gadi and wanted to do the film with a star hero. He told the story to Nagarjuna and convinced him to act in the film. As Nagarjuna will be acting in the film, there are high expectations about the film among the viewers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu