»   » విలన్ ఒక్కడే 12 పాత్రలు, ఏలియన్ గా విలన్: మతి పోయేలా రోబో2.0

విలన్ ఒక్కడే 12 పాత్రలు, ఏలియన్ గా విలన్: మతి పోయేలా రోబో2.0

Posted By:
Subscribe to Filmibeat Telugu

శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియా ఆల్ టైమ్ హై బడ్జెట్ మూవీ 2.0. ఈ సినిమా లోగో లాంచ్ టైమ్ లోనే... దీని స్థాయి ఏంటో అందరికీ తెలిసిపోయింది. రోబో మూవీకి సీక్వెల్ అయిన ఈ సైన్స్, ఫిక్షన్ మూవీని... 4 వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా... హాలీవుడ్ సినిమాలకు పనిచేసే నిపుణులతో శంకర్ నాలుగేళ్లుగా దీనికోసం కష్టపడుతున్నాడు. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ విలన్ గా చేస్తున్నాడు.

ఏలియన్ గెటప్

ఏలియన్ గెటప్

ఇప్పటివరకు అక్షయ్ కుమార్ గెటప్ ఒకటి మాత్రమే బయటికి వచ్చింది. అది ఏలియన్ గెటప్ అని టాక్. ఐతే... లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం... 2.0లో అక్షయ్ కుమార్ మొత్తం 12 పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. కమర్షియల్ సినిమాల శిల్పి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 2.0 మూవీలో అక్షయ్ కుమార్ పాత్ర ఎలియన్ అంటూ కొత్త సమాచారం ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలన్నిటిలో ఒక హాట్ టాపిక్.

మేకప్ కోసమే 6 గంటల సమయం

మేకప్ కోసమే 6 గంటల సమయం

దీనిపై అక్షయ్ కుమార్‌ను మాట్లాడుతూ, ఆ గెటప్ మేకప్ కోసమే 6 గంటల సమయం పడుతుందని, కానీ తన కెరీర్‌లో ఈ సినిమా మరిచిపోలేనని తెలిపాడు. అంతేకాదు ఆ గెటప్ లో తాను ఒక హోటల్ కి వెళ్లగా ఎవరూ తనని గుర్తుపట్టలేదట. ముందుగా అనుకున్నట్లు కాకి రూపం కాదని.. ఎలియన్ వికృత రూపం ఇదని అంటున్నారు.

అక్షయ్ కుమార్ పాత్ర ఏలియన్

అక్షయ్ కుమార్ పాత్ర ఏలియన్

అలాగే 'ఈ ప్రపంచం కేవలం మనుషులకే కాదు' అనే ట్యాగ్ లైన్ కూడా ఈ రూమర్ కు బలాన్ని ఇస్తోంది. నిజంగానే అక్షయ్ కుమార్ పాత్ర ఏలియన్ అయితే మాత్రం.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో తొలి చెడ్డ ఏలియన్ విలన్ గా అక్షయ్ కుమార్ నిలిచిపోనున్నాడు.

ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ గా

ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ గా

అక్షయ్ వేస్తున్న ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందట. ఒకదానికి ఒకటి పోలిక ఉండదట. 12 కేరెక్టర్స్ కు డిఫరెంట్ మేకప్ ఉంటుందట. ఈ మేకప్ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేశారని చెబుతోంది యూనిట్. సినిమాలోని దాదాపు చాలా పార్ట్ షూటింగ్ ఇప్పటికే అయిపోయింది.

12 గెటప్పులు

12 గెటప్పులు

అక్షయ్ కుమార్ ఆ 12 గెటప్పులను ఓపిగ్గా వేసుకుని.. నటించాడట. ఇందుకోసం... అక్షయ్ కుమార్ కు రోజుకు రూ.2కోట్ల రూపాయలు చెల్లించారట. ఇండియాలో ఓ హీరోకు రోజుకు రూ.2కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడూ లేనేలేదు. అలా.. పాత రెమ్యునరేషన్ రికార్డులన్నింటినీ అక్షయ్ కుమార్ ఈ సినిమాతో తుడిచిపెట్టేశాడు. రోజుకు రూ.2కోట్లు అంటే... ఈ మూవీకి రజినీకాంత్ తీసుకున్న రెమ్యునరేషన్ కంటే కూడా అక్షయ్ తీసుకున్నదే ఎక్కువ

ఏకంగా 15 భాషల్లో

ఏకంగా 15 భాషల్లో

ఇప్పటివరకూ బాహుబలి-2, దంగల్ చిత్రాలు కలెక్షన్ల విషయంలో హోరాహరీగా పోరాడుతున్నాయి. అయితే ఈ రికార్డుల కొట్లాటలు కేవలం కొద్దిరోజుల వరకేనని అనిపిస్తోంది. మొదట తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేద్దామని భావించారు. కానీ ఏకంగా 15 భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు తాజాగా నిర్ణయించారు. చైనీస్, జపనీస్, కొరియన్ భాషలు కూడా డబ్ చేసే భాషల లిస్టులో ఉన్నాయి.

English summary
Actor Akshay Kumar will play role of Alien in Robot 2. Rajinikanth and Akshay Kumar’s forthcoming and well-liked film Robo 2.0 will be released in 2018 but there is a tremendous enthusiasm for this film among people.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu