»   » సమంతా సమ్మగా ఉంటుంది... ఆలీ మళ్ళీ నోరు జారాడు

సమంతా సమ్మగా ఉంటుంది... ఆలీ మళ్ళీ నోరు జారాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆలి.. కామెడీ కమెడియన్ గానే కాకుండా.. యాంకర్ గా కూడా ఇటీవల కాలంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. టీవీ షోల దగ్గరి నుంచి.. పెద్దపెద్ద సినిమా ఆడియో ఫంక్షన్స్ వరకు ఆలీ చేయని ప్రోగ్రాం లేదు. అయితే, ఇటీవలే ఆలీ ఓ ఆడియో ఫంక్షన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ తన యాంకరింగ్ లో భాగమే అయినా కొన్ని సార్లు హీరోయిన్లమీదా, యాంకర్ల మీదా ఆలీ చేసిన కామెంట్లు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

సమంత నడుము గురించి

సమంత నడుము గురించి

ప్రతీ ప్రోగ్రాంలో అసభ్యకరమైన మాటలు అనడం ఆ తర్వాత తగిన మూల్యాన్ని చెల్లించుకోవడం ఆలికి అలవాటుగా మారింది.. ఈ మధ్య అది ఇంకా బాగా ఎక్కువైంది. మొన్నామధ్య సమంత నడుము గురించి, రీసెంట్ గా సుమ యాంకరింగ్ గురించి గొడవల్లో చిక్కుకున్న ఆలి మరోసారి సమంత మీద ఇంకో కామెంట్ చేసాడు... అయితే తర్వాత దాన్ని కవర్ చేసాడనుకోండి...

యూట్యూబ్ ద్వారా వార్నింగ్

యూట్యూబ్ ద్వారా వార్నింగ్

అంతే కాదు ఆశా అనే అమ్మాయి ఐతే యూట్యూబ్ ద్వారా వార్నింగే ఇచ్చింది. మాట్లాడేటప్పుడు అది ఒక లైవ్ ప్రోగ్రాం అనీ దాన్ని ఇంట్లో అందరూ కలిసి చూస్తారనీ అలీ కి అర్థం కాదా? ఇలాంటి పద్దతి మారక పోతే బుద్ది చెప్పాల్సొస్తుంది అటూ మాటలతో ఏకి పారేసింది.

వివాదాస్పదం అయ్యాయి

వివాదాస్పదం అయ్యాయి

ఆమధ్య సుమ పై చేసిన కామెంట్లకి బయట బాగానే చీవాట్లు తిన్నాడని టాక్ వచ్చింది. అది ముగియక ముందే సమంతా పై చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. ఇక నైనా కాస్త తగ్గిస్తాడనుకుంటే అస్సలు తగ్గలేదన్న విషయాన్ని మళ్ళీ రుజువు చేసుకున్నాడు...

 పలువురు హీరోయిన్లపై

పలువురు హీరోయిన్లపై

రాఘవేంద్రరావు దర్శక జీవితంపై ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన అలీ పలువురు హీరోయిన్లపై కామెంట్లు చేశాడు. ఒక వేళ మళ్ళీ మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీసేందుకు వస్తే హీరోయిన్ గా ఎవరిని ఎన్నుకుంటారు.. సమంతా, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్.. ఇంకా ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఎవరిని ఎంచుకుంటారు అని యాంకర్ సుమ అడిగింది.

సమంత అయితే సమ్మగా ఉంటుంది

సమంత అయితే సమ్మగా ఉంటుంది

అలీ టక్కున సమంత అని సమాధానం చెప్పేశాడు.. ఎందుకు సమంతనే ప్రిఫర్ చేస్తున్నారు అని సుమ అడిగితే "సమంత అయితే సమ్మగా ఉంటుందని" కామెడీ గా చెప్పాడు. అయితే పాత అనుభవాలు గుర్తొచ్చాయో ఏమో గానీ మళ్ళీ కొన్ని పొగడ్తలతో కవర్ చేసేసాడు... సమంత బాగా నటిస్తుందని.. శ్రీదేవిని కాస్త దిగ్గొట్టి పొట్టిగా చేస్తే సమంత అవుతుందని పొగిడేశాడు.. మనకు ఈ రకుల్, కాజల్ వంటి వారు సరిపోరని సమంతా నటన వల్ల తనకు బాగా నచ్చుతుందంటూ ముక్తాయించాడు.

English summary
Comedian Ali known for his mark of comedy in films but when it comes to off screen Ali always tries to go out of the board with his comments. Recently he commented on Samantha Again
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu