Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
తల్లి కాబోతోన్న శివజ్యోతి.. అలీ రెజా పోస్ట్ అర్థమదేనా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్యలో ఏర్పడే బంధాల్లో కొన్ని ఎప్పటికీ అలాగే ఉంటాయి. అందులో భాగంగా మూడో సీజన్ కంటెస్టెంట్లలో కొంత మంది ఇప్పటికే కలిసే ఉంటారు. కొందర ప్రాణ స్నేహితుల్లా ఉంటే.. ఇంకొందరు తోబుట్టువుల్లా కలిసి ఉంటారు. అలాంటి వారిలో శివజ్యోతి, రవికృష్ణ, అలీ రెజా ఉన్నారు. ఈ ముగ్గురు బిగ్ బాస్ షోలో చేసిన సందడి, వారి అనుబంధాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఓ గ్యాంగ్‌లా..
శివజ్యోతి, రోహిణి, అషూ, రవికృష్ణ, అలీ రెజా ఇలా అందరూ ఓ గ్యాంగ్‌లా కలిసి రచ్చ చేశారు. అయితే ఇందులో రోహిణి, అషూ మాత్రం త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. అలీ రెజా కూడా త్వరగానే ఎలిమినేట్ అయినా మళ్లీ రీఎంట్రీలో వచ్చి అదరగొట్టేశాడు.

ఎలిమినేషన్‌లో అలా..
బిగ్బాస్ ఇంట్లో ఎలిమినేషన్స్ జరిగితే ఆ రోజంతా ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది. కొందరు కంటెస్టెంట్లు సాధారణంగా రియాక్ట్ అవుతుంటారు. ఇంకొందరు ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటారు. అలా అలీ రెజా, రవికృష్ణ ఎలిమినేట్ అయిన సమయంలో శివజ్యోతి ఓ రేంజ్‌లో ఏడ్చేసింది. పాతాళగంగను తలిపించిందంటూ ఆమెపై విపరీతమైన ట్రోల్ జరిగేది.

బయటకు వచ్చాక..
అయితే బిగ్ బాస్ ఇంట్లో ఎంత సన్నిహితంగా ఉన్నారో.. బయటకు వచ్చాక కూడా అంతే క్లోజ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా కలిసిపోయారు. ఎవరి ఇంట్లో ఏ వేడుక జరిగినా కూడా అందరూ కలిసి రచ్చ చేస్తుంటారు. అలీ రెజా, తన భార్య మసూమతో కలిసి శివజ్యోతి ఇంట్లో సందడి చేస్తాడు.

శివజ్యోతి బర్త్ డే..
శివజ్యోతి బర్త్ డే నిన్న (ఫిబ్రవరి 14) జరిగింది. బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ కలిసి బాగానే సెలెబ్రేట్ చేశారు. దీనికి అలీ రెజా ఆలస్యంగానే వచ్చినట్టున్నాడు. అయితే శివజ్యోతికి అలీ రెజా చెప్పిన విషెష్, షేర్ చేసిన ఫోటో బాగా వైరల్ అవుతోంది.

ఒక తల్లి కడుపున పుట్టకపోయినా..
మనం ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా కూడా మన ఇద్దరి ఆత్మలు ఒకటే అని నేను నమ్ముతున్నాను. హ్యాపీ బర్త్ డే అక్కా.. నీకు మరింత సంతోషాలు రావాలని కోరుకుంటున్నాను.. విజయాలు దక్కాలని కూడా కోరుకుంటున్నాను.. అంతే కాకుండా త్వరలోనే ఓ బేబీ వస్తుందని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. అంటే శివజ్యోతి త్వరలోనే తల్లి కాబోతోందని అర్థమవుతోంది. ఓ ఇళ్లు, ఓ కారు కొనుక్కుంది. ఇప్పుడు ఇక తల్లి కూడా కాబోతోంది. మొత్తానికి శివజ్యోతి ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.