twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రైమ్ కామెడీ...(‘అలీ బాబా ఒక్కడే దొంగ’ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: ఒకప్పుడు అలీ హీరోగా సినిమాలు చాలా వచ్చేయి. అయితే తర్వాత సక్సెస్ రేటు బాగా తక్కువ అవటంతో అవి ఆగాయి. దాంతో చాలా కాలం గ్యాప్ తర్వాత అలీ హీరోగా తయారై విడుదలకు సిద్దమవుతున్న చిత్రం 'ఆలీబాబా ఒక్కడే దొంగ'. వంశీ తీసిన 'ఏప్రిల్ 1 విడుదల' తరహా సినిమా ఇది. ఇందులో సిస్టర్ సెంటిమెంట్ ఉంది.

    పల్లె నుంచి ఉద్యోగం కోసం ఓ యువకుడు నగరానికి వస్తాడు. ఎస్పై అవ్వాలనేది అతని కల. ఆ టైమ్‌లోనే ఓ ఏటీమ్‌లో పెట్టడానికి తీసుకెళ్తున్న డబ్బు దొంగతనానికి గురవుతుంది. ఆ నేరం అతనిపై పడుతుంది. ఆ నేరం నుంచి ఆ యువకుడు ఎలా బయటపడ్డాడు, తన కలను సాకారం చేసుకున్నాడా? లేడా? అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

    నిర్మాత మాట్లాడుతూ...అలీ... ఈ పేరు విన్నా, తెరపై చూసినా నవ్వు ఆపుకోలేరు ప్రేక్షకులు. వెయ్యికిపైగా చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల్ని అలరించారాయన. హీరోగానూ అందరి మనసులు గెలుచుకున్నారు. ఆయన హీరోగా నటించిన 50వ చిత్రం 'ఆలీబాబా ఒక్కడే దొంగ' కూడా ఖచ్చితంగా విజయవమంతమవుతుంది.

    దర్శకుడు ఫణి ప్రకాష్ మాట్లాడుతూ... ఎస్.ఐ అవుదామనుకుని వచ్చి దొంగగా మారిన ఓ యువకుని కథ ఇది. అలీ ఇంతవరకూ ఈ తరహా కామెడీ థ్రిల్లర్ చేయలేదు. పూర్తి కామెడీతో సినిమా ఉంటుంది అని చెప్పారు.

    చిత్రం: అలీ బాబా ఒక్కడే దొంగ
    పతాకం: కమల్ సినీ క్రియేషన్స్
    నటీనటులు: అలీ, సుజా వారుణి, తణికెళ్ల భరణి, జీవా,షఫీ, రఘుబాబు, దువ్వాసి మోహన్, రాంజగన్, కొండవలస, దాసన్న,రామరాజు, చంద్రశేఖర్, పృధ్వీ తదితరులు
    సంగీతం: సాయి శ్రీకాంత్,
    కెమెరా: జాన్,
    కో డైరక్టర్: ఎన్ అనీల్ కుమార్,
    ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సాయిబాబు వాసిరెడ్డి.
    కథ,స్క్ర్రీన్ ప్లే, దర్శకత్వం: ఫణి ప్రకాష్
    నిర్మాత:బొడ్డాడ శివాజి

    English summary
    Ali Baba Okkade Donga marks the 50th film of the comedian. The movie also features Suja Varuni in an important role. The film is a comedy and revolves around a young person, who comes to the city to become a police officer. However, he gets trapped in a robbery case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X