»   » విజయ్ మాల్యాను పట్టేసిన అల్లరి నరేష్

విజయ్ మాల్యాను పట్టేసిన అల్లరి నరేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల్లో నవ్వుల పుప్వులు పూయించే అల్లరి నరేష్ తన అల్లరి చేష్టను ప్రదర్శించాడు. విలాస జీవితాన్ని గడిపి బ్యాంకర్లకు కోట్ల రూపాయలు టోపీ పెట్టిన విజయ్ మాల్యా గురించి అతను విచిత్రమైన వ్యాఖ్య చేశాడు.

మాల్యాను పట్టిస్తే బ్యాంకర్ల సంతోషం చెప్పనలవి కాడు. బ్యాంకర్లు మాల్యాను పట్టిస్తే ఏ విధమైన అఫర్ కూడా ప్రకటించలేదు. అయినా విజయ్ మాల్యా తనకు దొరికేశాడు అంటున్నాడు అల్లరి నరేష్.

కామెడీకి సినిమాల్లో పెట్టింది పేరైన అల్లరి నరేష్ గతంలో మాల్యాతో దిగిన ఓ ఫొటోని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ బ్యాంకర్లకు కూడా చిక్కని మాల్యా నా సెల్ఫీకి చిక్కాడంటూ హస్యరసాన్ని పండించాడు.

Allari naresh captures Vijay Mallya

బ్యాంకులకు చిక్కని మాల్యా తనకు చిక్కడం ఆనందంగా ఉందని నరేష్ పోస్టు పెట్టారు. రీల్‌లైఫ్‌లోనే కాకుండా రియల్‌లైఫ్‌లో కూడా నరేష్ ఇలా తన కామేడితో అందరికి కితకితలు పెట్టాడు. అయితే నరేష్ తన తదుపరి చిత్రానికి 'సెల్ఫీ రాజా' అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం విధితమే. అందులో భాగంగానే ఈ ప్రత్యేక సెల్ఫీ పోస్టు చేసిన్నట్టున్నాడు హీరో.

విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో మకాం వేసినట్లు భావిస్తున్నారు. అతన్ని ఇండియాకు రప్పించడం సాధ్యమవుతుందా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే అల్లరి నరేష్ మాత్రం తన కళాకౌశలాన్ని ప్రదర్శించాడు.

English summary
Tollywood hero Allari Naresh posted his photograph with Vijay Mallya in Facebook.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu