»   » బాహుబలితో పాటు అల్లరి నరేష్!

బాహుబలితో పాటు అల్లరి నరేష్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తనదైన కామెడి స్టయిల్, టైమింగ్ తో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తున్న ఈ తరం కామెడి స్టార్ అల్లరి నరేష్. తన మొదటి చిత్రం అల్లరి నుండి ఇప్పటి వరకు ఎన్నో కామెడి చిత్రాల్లో నటించి ఆడియెన్స్ ను అలరించి తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు.

ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా నటించిన చిత్రం ‘జేమ్స్ బాండ్'. ఓ అమాయకుడైన యువకుడు ఓ డాన్ లేడీకి చేతికి చిక్కి ఎలాంటి బాధలు పడ్డాడనే కాన్సెప్ట్ తో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న గ్రాండ్ లెవల్ లో విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీ ‘బాహుబలి' ఇంటర్వేల్ లో ప్రదర్శించనున్నారు.

Allari Naresh film trailer with Baahubali

అల్లరి నరేస్, సాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘జేమ్స్ బాండ్'. నేను కాదు నా పెళ్లాం అనేది సబ్ కాప్షన్. ఎ.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కిషోర్ మచ్చ దర్శకత్వం వహించగా, సాయి కార్తీక్ సంగీతం అందించారు.

ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణ భగవాన్, పోసాని తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, విశ్వ, భువనచంద్ర, ఆర్ట్: కృష్ణమాయ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సంగీతం: సాయి కార్తీక్, నిర్మాత: రామసుబ్రహ్మణ్యం, దర్శకత్వం: సాయి కిసోర్ మచ్చ.

English summary
Allari Naresh's James Bond theatrical trailer will be screened along with Baahubali film
Please Wait while comments are loading...