For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోన్లెండి అల్లరి నరేష్ కి ఇప్పటికైనా తెలిసొచ్చింది

  By Srikanya
  |

  హైదరాబాద్ : నా దగ్గరకి కథ చెప్పడానికి వస్తున్న చాలామంది ఇప్పటికీ ఫలానా సినిమాలోని 'పేరడీ డైలాగ్‌తో మీ ఇంట్రడక్షన్ ఉంటుంది' అని చెబుతున్నారు. అలాంటి కథలను వద్దంటున్నా. ఇక నుంచి నేను స్పూఫ్స్‌లో నటించను. 'సుడిగాడు' వంటి పూర్తిస్థాయి స్పూఫ్ చిత్రంలో నటించిన తరువాత పేరడీ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నా. ప్రేక్షకులు ఇకముందు నన్ను అలాంటి పాత్రల్లో చూడకపోవచ్చు అంటున్నారు అల్లరి నరేష్. ఆయన పుట్టిన రోజు సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేసారు.

  తన చిత్రాలు గురించి చెప్తూ... డిసెంబర్‌లోగా నా ఐదు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నా. చిన్నికష్ణ దర్శకత్వంలో వస్తున్న నాటుబాంబు (వర్కింగ్ టైటిల్) వచ్చే నెలలో విడుదల కానుంది. ప్రస్తుతం నా 48వ సినిమా నడుస్తోంది. నా యాభయ్యో సినిమా గురించి కొంచెం కేర్ తీసుకుంటున్నా. షార్ట్‌ఫిలిమ్స్ తీసిన యంగ్‌స్టర్స్ వచ్చి కథలు చెప్తున్నారు. ఇంకా ఏదీ సెలెక్ట్ చేసుకోలేదు. రాజేష్, నేను కలిసి నటించే చిత్రం వచ్చే ఏడాది రావచ్చు. మేం నడపబోతున్న ట్రస్ట్‌కు సంబంధించిన కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయి. నా ప్రతి సినిమా రెమ్యునరేషన్‌లో ఐదు లక్షలు ఆ ట్రస్ట్‌కు ఇస్తాను అన్నారు.

  Allari Naresh says not interested in Spoof

  నిర్మాతగా మారిన తరువాత వచ్చిన ఫస్ట్ బర్త్ డే ఇది. ఈ ఏడాదే ప్రొడక్షన్‌లో దిగాం. కొంచెం ఎగ్జయింటింగ్, కొంత నర్వస్‌గానూ ఉంది. నాన్నగారు ఉన్నప్పుడు ఆయన ఉన్నారనే ధైర్యం ఉండేది. ఇప్పుడు పూర్తిస్థాయిలో అన్నీ మేమే చేసుకోవాలి. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అందుకని అన్నీ ముందుగానే రెడీ చేసుకున్నాం. జూలై 1 నుంచి రాజమండ్రిలో 'బందిపోటు' ఫస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది.

  ఈవీవీ సినిమాను ఎస్టాబ్లిష్ చేయాలనే తపనతో ఉన్నాం. అందుకోసం మా ప్రొడక్షన్‌లో సంవత్సరానికి మూడు సినిమాలు తీయాలనుకుంటున్నాం. నేను హీరోగా ఒక సినిమా, మిగతా రెండు బయటి హీరోలతో చేయాలనేది మా ప్రణాళిక. నన్ను దర్శకుడిగా చూడాలనేది నాన్నగారి కోరిక. కచ్చితంగా దర్శకత్వం చేస్తా. అది 2017లో సాధ్యపడవచ్చు అన్నారు.

  English summary
  “It was a comedy and after that I acted in a few more comedy films. Though I have also done a few serious films but producers and distributors told said that I am more apt for comedy,” says Naresh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X