»   » చిరంజీవి సంబంధం లేని వ్యక్తి కాబట్టే పిలవలేదు: అల్లు అర్జున్

చిరంజీవి సంబంధం లేని వ్యక్తి కాబట్టే పిలవలేదు: అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఇటీవల జరిగిన డిజే ఆడియో వేడుకకు చిరంజీవి వస్తారని ప్రచారం జరిగింది. కానీ చిరంజీవి హాజరు కాలేదు. డిజే ప్రమోషన్లలో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పారు.

  అసలు ఆ వేడుకకు మెగాస్టార్‌ను ఆహ్వానించనేలేదని, అందుకే ఆయన రాలేదని తెలిపారు. దాసరి మరణం తర్వాత పరిశ్రమలో విషాదం నెలకొంది. అందుకే ఆడియో వేడుక కూడా నిర్వహించకూడదని అనుకున్నాం. కానీ సినిమా రిలీజ్ సమీపిస్తుండటంతో ప్రమోషన్ల కోసం ఆడియో వేడుక చేయక తప్ప లేదు.


  సంబంధం లేని వ్యక్తి

  సంబంధం లేని వ్యక్తి

  ఆడియో వేడుక ప్రముఖులెవరినీ పిలవకుండా సింపుల్ గా చేద్దామని అనుకున్నాం. అందుకే చిరంజీవిగారిని పిలవలేదు. మెగాస్టార్‌నే కాదు.. ‘డీజే' సినిమాతో సంబంధం లేని ప్రముఖులెవరినీ ఆ వేడుకకు ఆహ్వానించలేదని అల్లు అర్జున్ తెలిపారు.


  మరో మెగాస్టార్ అవకాశమే లేదు

  మరో మెగాస్టార్ అవకాశమే లేదు

  మెగాస్టార్ తరువాత ఆ స్థానానికి చేరువగా ఉన్నది అల్లు అర్జున్ మాత్రమేననే ప్రచారం జరుగడంపై బన్నీ స్పందిస్తూ... మెగా స్టార్ అంటే చిరంజీవిగారు మాత్రమే. మరో మెగా స్టార్ వుండే అవకాశమే లేదని అల్లు అర్జున్ అన్నాడు.


  ఆయనంటే గౌరవం

  ఆయనంటే గౌరవం

  చిరంజీవి స్టెప్ ను వేయడమో .. ఆయన డైలాగ్ చెప్పాడమో తప్ప ఎప్పుడూ ఆయన్ను ఇమిటేట్ చేయలేదని, చిరంజీవి గారంటే తనకి ఎంతో గౌరవమనీ, ఇష్టమని అల్లు అర్జున్ అన్నాడు.


  ఒరిజినల్ పర్సన్

  ఒరిజినల్ పర్సన్

  మెగాస్టార్ ఓ ఒరిజినల్ పర్సనాలిటీ అనీ, ఆయన స్థానానికి చేరువగా వెళ్లాలనే ఆలోచన కూడా రాదని అల్లు అర్జున్, ఆయన స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి వల్లా కాదని తెలిపారు.


  కుమారుడి చేష్టలకు షాకైన బన్నీ

  కుమారుడి చేష్టలకు షాకైన బన్నీ

  డీజే ఆడియో ఫంక్ష‌న్‌లో అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్‌ స్టేజీపై చేతులెత్తి అంద‌రికీ దండం పెట్టిన విష‌యం తెలిసిందే. త‌న కొడుకు స్టేజీపై నిల‌బ‌డి అలా చేస్తాడ‌ని అనుకోలేదని.. అది చూసి తాను షాక‌య్యానని అన్నాడు.  English summary
  When the media people asked about the absence of Chiranjeevi at the event, Bunny said that the makers of DJ are not interested in conducting the event as it is the time when Dasari passed away. As the release date is nearing, the makers chose to conduct the function by inviting the cast and crew alone.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more