»   » షాక్ అంటే ఇదీ..! ఈరోజు రాత్రే దువ్వాడ... ట్రైలర్ రిలీజ్

షాక్ అంటే ఇదీ..! ఈరోజు రాత్రే దువ్వాడ... ట్రైలర్ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉన్నట్టుండీ 'దువ్వాడ జగన్నాథం' టీం పెద్ద షాకే ఇచ్చింది. ఈ రోజు రాత్రికే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ , టీజర్, సాంగ్స్‌తో యూట్యూబ్‌ను షేక్ చేసిన దువ్వాడ జగన్నాథం థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు కంప్లీన్ కావడంతో ఈ రోజు (సోమవారం) రాత్రి ఏడున్నర గంటలకు ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

రాత్రి 7.30కు ‘డీజే' ట్రైలర్

రాత్రి 7.30కు ‘డీజే' ట్రైలర్

రాత్రి 7.30కు ‘డీజే' ట్రైలర్ ను ట్విట్టర్లో లాంచ్ చేయబోతున్నారు. ఆడియో వేడుకో.. ప్రి రిలీజ్ ఈవెంటో పెట్టి.. భారీ హంగామా మధ్య థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తారేమో అనుకుంటే.. టీజర్ మాదిరే ట్రైలర్ లాంచ్ కూడా సోషల్ మీడియాలోనే చేయబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. అది కూడా కౌంట్ డౌన్ ఏమీ లేకుండా ఉదయం ప్రకటించి.. సాయంత్రానికి ట్రైలర్ లాంచ్ చేసేస్తుండటం మరీ వెరైటీ...

సడెన్‌గా షాకిచ్చాడు

సడెన్‌గా షాకిచ్చాడు

ఇంతకుముందు ‘డీజే' టీజర్ రిలీజవ్వడానికి కొన్ని రోజులుండగానే ప్రకటన చేశారు. కౌంట్ డౌన్ మొదలుపెట్టి హంగామా చేశారు. ట్రైలర్ విషయంలోనూ అలాగే ముహూర్తం కొన్ని రోజుల ముందే ప్రకటించి నెమ్మదిగా హైప్ పెంచుతారనుకుంటే.. అలాంటిదేమీ లేకుండా సడెన్‌గా షాకిచ్చాడు హరీష్ శంకర్.

ఒకవైపు ఆనంద పడుతూనే

ఒకవైపు ఆనంద పడుతూనే

ఒకవైపు 'దువ్వాడ జగన్నాథం' మూవీలోని గుడిలో ఒడిలో బడిలో పాట పెట్టిన చిచ్చు ఇంకా చల్లారక ముందే ఈ సాయంత్రం విడుదల కాబోతున్న డిజే ట్రైలర్ లో ఇంకా ఎటువంటి సంచలనాలు ఉంటాయో అని బన్నీ అభిమానులు ఒకవైపు ఆనంద పడుతూనే మరొక వైపు భయపడుతున్నారు.

హైక్ తీసుకురావడానికి

హైక్ తీసుకురావడానికి

ఈ నెలాఖరుకు విడుదల కాబోతున్న ఈసినిమా పై హైక్ తీసుకురావడానికి ఈ ట్రైలర్ చాల సహకరిస్తుందని హరీష్ శంకర్ భావిస్తున్నట్లు టాక్.‘డీజే' ట్రైలర్ నిడివి 2 నిమిషాలుంటుందని.. కథేంటో ఐడియా ఇచ్చేలా ట్రైలర్ ఉంటుందని.. ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ట్రైలర్లో హైలైట్ అవుతాయని అంటున్నారు.

ప్రకంపనలు

ప్రకంపనలు

‘డీజే'కు సంబంధించి ఇప్పటిదాకా బయటికి వచ్చిన విశేషాలన్నీ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్.. టీజర్.. ‘గుడిలో బడిలో మడిలో' సాంగ్ టీజర్.. ఇలా అన్నీ కూడా ప్రకంపనలు రేపాయి. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉండే ‘డీజే' ట్రైలర్లో స్టోరీ ఏంటో చెప్పేయబోతున్నాడట హరీష్ శంకర్.

రెండో యాంగిల్

రెండో యాంగిల్

ఇందులో బ్రాహ్మణ బన్నీలోని రెండో యాంగిల్ కూడా చూపిస్తారట. ఇప్పటికే ఈ సినిమా కథ అంటూ మీడియాలో చాలా ప్రచారాలు నడిచాయి. జనాలు ఆల్రెడీ ఒక ఐడియాతో ఉన్నారు. మరి ట్రైలర్ ద్వారా ఎలాంటి ఐడియా వస్తుందో చూడాలి. ఈ ట్రైలర్ లో ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సీన్స్ కు సమాన ప్రాధాన్యత ఇచ్చే విధంగా దర్శకుడు హరీష్ శంకర్ ఈ ట్రైలర్ ను డిజైన్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి.

బాహుబలి రికార్డులు బద్దలవడం ఖాయం

బాహుబలి రికార్డులు బద్దలవడం ఖాయం

టీజర్.. సాంగ్ టీజర్‌లకు యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రికార్డుల మోత మోగింది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో అని బన్నీ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ విషయంలో నాన్-బాహుబలి రికార్డులన్నీ బద్దలవడం ఖాయమని భావిస్తున్నారు.డీజే' టీజర్ తో యూట్యూబ్ లో ఎంతటి సంచలనానికి తెరతీసిందో తెలిసిందే. మరి ఈసారి ఏం చేయబోతున్నారో...

English summary
DJ-Duvvada Jagannadham' director Harish Shankar gave a huge surprise today with his twitter announcement. Harish revealed the 'DJ' theatrical trailer release with a poster and tweeted that "Super Duper excited Guys ....Sharp....... 7.30 Pm Today".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu