»   » పవన్ ఫ్యాన్స్ కి బన్ని ఇచ్చిన క్లాస్ కు రెస్పాన్స్ ఏంటి?

పవన్ ఫ్యాన్స్ కి బన్ని ఇచ్చిన క్లాస్ కు రెస్పాన్స్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ తనపై ట్విట్టర్ లో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు ఒక మనసు ఆడియో పంక్షన్ ని వేదికగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆడియో పంక్షన్ లో ఆయన చెప్పను బ్రదర్ అంటూ మాట్లాడిన మాటకు , పవన్ ఫ్యాన్స్ ..చూసుకుందాం బ్రదర్ అని చెప్పిన సమాధానానికి రౌండ్ వేస్తా అంటూ చెప్పి మరీ మెగా క్లాస్ ఇచ్చారు.

నిజం చెప్పాలంటే ఈ స్పీచ్ పై అంతా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. మిక్సెడ్ రెస్పాన్స్ వచ్చింది. అల్లు అర్జున్...పెద్దమనిషి అయ్యాడు..అందుకే క్లాసులు పీకుతున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. బన్ని తన ఏటిట్యూడ్ చూపెడుతున్నాడంటూ కామెంట్స్ వినిపించాయి. తమ కుటుంబం మొత్తం పవన్ ఫ్యాన్స్ నినాదాల వల్ల సిగ్గుపడుతోందన్న అర్దం వచ్చేలా ఆయన స్పీచ్ సాగింది.


మేం బాధపడ్డాం..మీరు ఇలా చేయవద్దు..అలా చేయవద్దు..నేను సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాను.. నాకు తెలుసు ఎప్పుడు మాట్లాడాలో ..అంటూ ఆయన ప్రసంగంలో దొర్లిన ఈ పదాలు, ప్యాన్స్ ని నిజంగానే బాధపెట్టాయి. ఫ్యాన్స్ లేనిదే ఏ హీరో అయినా ఎలా సర్వైవ్ అవుతాడు అని వారు అంటున్నారు.


బన్ని చెప్పిన విషయాల్లో కొన్ని విలువైన మాటలు ఉన్నప్పటికీ ఆయన అలా ఫ్యాన్స్ ముందు అనకుండా ఉండాల్సింది అంటున్నారు. ఆయన టోన్, బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టింది. అందులో బన్ని ఏరిగెన్స్ కనపడింది అంటున్నారు. అయితే కొద్దిమంది మాత్రం బన్ని తన మనస్సులో మాట చెప్పాడు. కాస్త కఠినంగా ఉన్నప్పటికి అదే నిజం అంటున్నారు.


కారణం మీరే

కారణం మీరే

''మీరు ప్రతీసారి పవర్‌స్టార్ అని అరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోవడానికి కారణం పవర్‌స్టార్ కాదు. మీరే. అని బన్ని తేల్చి చెప్పారుచాలా ఇబ్బంది పెడుతున్నారు

చాలా ఇబ్బంది పెడుతున్నారు

కొంత మంది అభిమానులు పబ్లిక్ ఫంక్షన్ పెట్టినప్పుడు పవర్‌స్టార్ అని అరుస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు'' అని బన్నీ అన్నారు.డిస్ట్రబ్ చేస్తున్నారు

డిస్ట్రబ్ చేస్తున్నారు

''ఇలాంటి ఫంక్షన్‌కు వచ్చినప్పుడు సినిమాకు సంబంధించినవాళ్ళు పర్సనల్‌గా ఏదో చెప్పుకోవాలనుకుంటారు.కానీ మీరు 'పవర్‌స్టార్', 'పవర్‌స్టార్' అని అరిచి వాళ్లను డిస్టర్బ్ చేయడంతో వాళ్లు యాంత్రికంగా మాట్లాడి వెళ్ళిపోతారు.


పెద్ద డైరక్టర్ మాట్లాడుతూంటే...

పెద్ద డైరక్టర్ మాట్లాడుతూంటే...

అంతవరకూ ఎందుకు? ఓ పెద్ద డెరైక్టర్ సినిమా తీసి మాట్లాడుతుంటే, అక్కడ పవన్‌కల్యాణ్ అని అరిచారు. అయినా వేరే హీరో ఫంక్షన్స్‌లో మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఎందుకని నా ఫీలింగ్.


మీవాళ్ల గోలేంటి

మీవాళ్ల గోలేంటి

ఇదే విషయాన్ని నాకు బాగా తెలిసిన వ్యక్తి 'మా వాళ్ల ఫంక్షన్‌లో మీ వాళ్ల గోలేంటి' అని అడిగారు.చాలా బాధ అనిపించింది.తప్పులేదు కానీ..

తప్పులేదు కానీ..

మన పాటల వేడుకల్లో అల్లరి చేయండి.. తప్పు లేదు. కానీ, వేరే హీరోల వేడుకల్లో కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు.ఎంత ఇబ్బంది

ఎంత ఇబ్బంది

తానింత స్థాయికి రావడానికి కారణం చిరంజీవిగారే అని పవన్‌కల్యాణ్‌గారే చాలాసార్లు చెప్పారు. కానీ, చిరంజీవిగారు మాట్లాడుతున్నప్పుడు 'పవర్‌స్టార్' అని అరిస్తే ఆయనకెంత ఇబ్బందిగా ఉంటుందో?


అందుకే డిసైడ్

అందుకే డిసైడ్

అప్పటినుంచి నేను పవన్‌కల్యాణ్‌గారి గురించి మీరెంత అడిగినా మాట్లాడకూడదని డిసైడయ్యాను.


హర్ట్ అయ్యాం

హర్ట్ అయ్యాం

మీరు నా వల్ల బాధపడుంటారని తెలుసు. కానీ, మీ వల్ల మా ఫ్యామిలీ చాలాసార్లు హర్ట్ అయింది.పెద్దదైంది

పెద్దదైంది

నేను ఒక వివాదాన్ని తప్పించుకోవడానికి మీడియా ముందు మాట్లాడ లేదు. కానీ అదే పెద్ద వివాదమైంది.ఇష్టమే..

ఇష్టమే..

నాకు పవన్‌కల్యాణ్ అంటే ఇష్టమే. చిరంజీవిగారి తర్వాత నన్ను ప్రోత్సహించింది ఆయనే.


మాట్లాడలేను

మాట్లాడలేను

‘‘మీరంతా ఎంతగా అరిచినా పవన్‌కల్యాణ్‌ గురించి నేను మాట్లాడను... మాట్లాడలేను. ఆయన మీద ఉన్న ఇష్టాన్ని గతంలో ఎన్నోసార్లు చెప్పాను.ఇంకా కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినీరంగంలో చిరంజీవి తర్వాత నన్ను సపోర్ట్‌ చేసింది పవన్‌కల్యాణే'' అన్నారు.


ఇక ఆపండి

ఇక ఆపండి

చాలా రోజులుగా సోషల్ మీడియాలో గ్రూపులుగా విడిపోయి మాటల యుద్ధంలోకి దిగారు. ప్లీజ్.. దీన్ని ఆపండి. మీరందరూ సోషల్ మీడియాలో గ్రూప్‌లు కావచ్చు. కానీ మేమందరం ఓ ఫ్యామిలీ. దయచేసి ఇక నుంచి ఇలాంటివి చేయద్దు'' అని ఆవేదన వ్యక్తం చేశారు బన్నీ.


అపార్దాలే

అపార్దాలే

ఫ్యామిలీకి సంబంధించిన ఈ అంశంపై ఏం మాట్లాడినా అపార్థాలే వస్తున్నాయని... అభిమానులు కేకలు వేస్తూ.. తనను వంద రెట్లు హర్ట్‌ చేశారన్నారు.బాధించాయి

బాధించాయి

సోషల్‌ మీడియాలో వస్తోన్న అనేక కామెంట్లు తనను చాలా బాధించాయని ఆవేదనగా చెప్పారు. అలాంటి కామెంట్లు చేయొద్దని పవన్‌ను, తనను ఇష్టపడే అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.


మచ్చ వస్తోంది

మచ్చ వస్తోంది

అలాంటి కామెంట్లతో తమ కుటుంబానికి ఇబ్బంది వస్తుందని.. తన మూలంగా అందరికీ మచ్చరావడం ఇష్టం లేదన్నారు.ఆశిస్తున్నా

ఆశిస్తున్నా

అభిమానులంతా మంచి ప్రవర్తనతో మెలుగుతూ తనను అర్థం చేసుకుంటారని అల్లు అర్జున్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.English summary
Allu Arjun put an end to #CheppanuBrother and spoke at length about the whole issue.Allu Arjun was present at the Oka Manasu audio event that was held May 18 at Shilpa Kala Vedika and he clarified the issue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X