»   » ఆయన సాధించింది ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేదు: అల్లు అర్జున్

ఆయన సాధించింది ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేదు: అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు దర్శకుడు కె.విశ్వనాథ్ కు ప్రతిష్టాత్మక 'దాదా ఫాల్కే అవార్డు' కు ఎంపికైన నేపథ్యంలో సినీ ప్రముఖులంతా ఆయన నివాసానికి చేరుకుని అభినందనలు తెలుపుతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కె. విశ్వానాథ్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..... ఇండియన్ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు కె.విశ్వనాథ్ గారికి రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన గ్రేటెస్ట్ లెజెండ్ విశ్వనాథ్ గారికి ఈ అవార్డు వస్తే జస్ట్ ఆనందంగా ఉంది ఇలా చెబితే సరిపోదు. నా పర్సనల్ టాప్ ఫేవరెట్ డైరెక్టర్లలో విశ్వనాథ్ గారు ఉంటారని బన్నీ అన్నారు.

అపుడు ఆయన సినిమాల్లో డెప్త్ తెలియలేదు

అపుడు ఆయన సినిమాల్లో డెప్త్ తెలియలేదు

ఎప్పుడో చిన్నపుడు ఆయన సినిమాలు చూసాను. అపుడు అంత అనుభవం లేదు కాబట్టి ఆ సినిమాల డెప్త్ తెలియలేదు. ఒక సంవత్సరం క్రితం అనుకోకుండా నేను పని చేస్తున్నఓ డైరెక్టర్ దగ్గర నుండి విశ్వనాథ్ గారు చేసిన అన్ని సినిమాల లిస్ట్ అన్ని తీసుకుని వరుసగా నాలుగు నెలల్లో చూసాను అని బన్నీ అన్నారు.

ఎవరూ టచ్ చేయలేదు

ఎవరూ టచ్ చేయలేదు

కె.విశ్వనాథ్ గారు ఆ టైంలో అచీవ్ చేసింది ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేదు. ఆయన తీసిన లాంటి గ్రేట్ సినిమాలు భవిష్యత్తులో వస్తాయని నా నమ్మకం అని బన్నీ వ్యాఖ్యానించారు.

స్వాతి ముత్యంలో నేనూ నటించాను

స్వాతి ముత్యంలో నేనూ నటించాను

విశ్వనాథ్ గారు మా ఫ్యామిలీకి చాలా క్లోజ్. చిరంజీవి గారితో స్వయంకృషి సినిమా చేసారు. స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ గారి గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు. అందులో నేను, మా కజిన్స్ యాక్ట్ చేసామని బన్నీ తెలిపారు.

పర్సనల్ కనెక్షన్

పర్సనల్ కనెక్షన్

నాకు పర్సనల్ గా విశ్వనాథ్ గారితో కనెక్షన్ ఏమిటంటే మా తాతయ్య గారు శంకరాభరణం సినిమాలో చేయడం. ఇప్పటికీ ఏ ఫంక్షన్ కి వెళ్లినా మా తాతయ్య గారి గురించి మాట్లాడినపుడు శంకరాభరణం రామలింగయ్య గారి క్యారెక్టర్ చాలా బావుంటుందని అంటుంటారు. ఆయన కెరీర్లో ఒక మైల్ స్టోన్ విశ్వనాథ్ గారు ఇచ్చిందే అన్నమాట. అనుకోకుండా విశ్వనాథ్ గారితో నేను బన్నీ అనే సినిమా చేసారు. సినిమాలో చివర్లో సిఎం క్యారెక్టర్ వేసారు. అప్పుడు ఆయన అడిగే వారు నీ ఎనర్జీ బావుంటదయ్యా అని. అప్పటి నుండి ఎప్పుడు కలిసినా కూర్చుని మాట్లాడుకుంటాం. నిజంగా నాకు చాలా చాలా ఇష్టం, గౌరవం ఉన్న దర్శకుడు. ఆయన లాంటి గొప్ప దర్శకులు ఇండస్ట్రీలో ఇంకా రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

English summary
Veteran film maker Kasinathuni Viswanath, has been conferred with Dadasaheb Phalke Award for 2016, which is India’s highest award in Cinema. Recently Megastar Chiranjeevi, Power Star Pawan Kalyan and Trivikram Srinivas met and congratulated the director on this occasion. Now it was the turn of Stylish Star Allu Arjun. He also met the legendary director K Vishwanath and spent some time with him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu