»   » భోగీ వేడుకల్లో అల్లు అర్జున్‌ (ఫొటో)

భోగీ వేడుకల్లో అల్లు అర్జున్‌ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : అల్లు అర్జున్‌ తెల్లవారుజామున భోగీ మంటలు వేసి తన అభిమానులందరికి 'భోగీ' శుభాకాంక్షలు తెలిపారు. తన ఆఫిషియల్‌ ఫేస్‌ బుక్‌ ఖాతా ద్వారా ఆయన తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

Happy Bhogi !

Posted by Allu Arjun on 13 January 2016

అల్లు అర్జున్ తాజా చిత్రం విషయానికి వస్తే...

అల్లు అర్జున్, బోయపాటి శీను కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం సరైనోడు. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ని లవర్స్ డే రోజు అనగా ఫిబ్రవరి 14 న జరిపేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో బన్నీ ఇప్పటివరకూ కనిపించనటువంటి మాస్ లుక్‌లో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రం లేటెస్ట్ షెడ్యూల్ జనవరి 24 నుండి హైదరాబాద్‌లో జరగనుంది. క్లైమాక్స్ ను భారీగా చిత్రీకరించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నారు.

Allu Arjun's Bhogi Wishes

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెస్రాలు నటించనుండగా, దిశా పటానీ ఐటెం సాంగ్‌లో మెరవనుంది. ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Wishing Stylish Star Allu Arjun a Very Bhogi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu