»   » కొడుకుతో అల్లు అర్జున్...ఈ ఫొటోకు వీర క్రేజ్, ఫ్యాన్స్ తెగ లైక్స్, కామెంట్స్

కొడుకుతో అల్లు అర్జున్...ఈ ఫొటోకు వీర క్రేజ్, ఫ్యాన్స్ తెగ లైక్స్, కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అసలే అల్లు అర్జున్ అంటే అభిమానులుకు ఓ రేంజిలో క్రేజ్. దానికి తగినట్లు ఆయన తన టీమ్ తో చక్కగా ఫేస్ బుక్ పేజిని మెయింటైన్ చేస్తూంటారు. ఎప్పటికప్పుడు లైవ్ అప్ డేట్స్ తో ఆ పేజి చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. దాంతో ఆ పేజీలో కొత్తగా ఏం షేర్ చేస్తారా అని అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తూంటారు.

తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫేస్‌బుక్‌లో ఒక చూడచక్కని ఫొటోను షేర్‌ చేశారు. బన్నీ తన వారసుడు అల్లు అయాన్‌ను ఒళ్లొ కుర్చోబెట్టుకుని ఫుల్ హ్యాపీ మూడ్ లో అందులో కనిపించారు. అదిరిపోయే ఈ ఫొటో కు అభిమానుల నుంచి అంతకు మించి అన్నట్లుగా... వరుసబెట్టి కామెంట్స్‌, లైక్స్‌ వస్తున్నాయి.

బన్నీ తన ఫేస్‌బుక్‌లో ఫొటోను షేర్‌ చేసిన 12 గంటల్లోనే లక్ష తొంభై మూడు వేల మంది లైక్‌ చేశారు, 717మంది కామెంట్స్‌ చేశారు.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దువ్వాడ జగన్నాథమ్‌'(డీజే) చిత్రంలో నటిస్తున్నారు. పూజాహెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫేస్‌బుక్‌లో ఒక చూడచక్కని ఫొటోను షేర్‌ చేశారు. బన్నీ తన బుల్లి వారసుడు అల్లు అయాన్‌ను ముద్దుగా ఒళ్లొ కుర్చోబెట్టుకుని చాలా సంతోషంగా అందులో కనిపించారు.

English summary
Since Allu Arjun is the only south Indian actor who has more than a crore followers on Facebook, we know how much he cares about his fans who adore him. So the actor was quick enough to share the good news and photos with him fandom online. Now Allu Arjun shared a beautiful picture of his son Ayan in Face book.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu