»   » అల్లు అర్జున్ దంపతులు ప్రేమతో పొడిపించుకున్న పచ్చ..(ఫోటో)

అల్లు అర్జున్ దంపతులు ప్రేమతో పొడిపించుకున్న పచ్చ..(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కేవలం వివాహం మనల్ని సంతోషపరచదు. సంతృప్తికరంగా ఆనందదాయకంగా ఉండేలా మనమే మలచుకోవాలి. పరస్పర విశ్వాసమే ఆలంబనగా సాగే దాంపత్య జీవనంలో కలతలకు తావుండదనేది నిజం! ఒకరెక్కువ మరొకరు తక్కువ అనే భావన లేనంతవరకు సంసార జీవితం సాఫీగా సాగుతుందనేది సత్యం.

Allu Arjun-Sneha Reddy dance

ఈ విషయాలను అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులు తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. అల్లు అర్జున్ తన చేతిపై 'స్నేహ' పేరును పచ్చ పొడిపించుకున్న విషయం చాలా రోజుల క్రితమే బయట పడింది. కానీ స్నేహ కూడా తన ఉంగరపు వేలిపై అల్లు అర్జున్ పేరును టాటూ వేయించుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ప్రేమ వివాహం చేసుకున్న వీరు....తమ మధ్య ఉన్న ప్రేమ అందరికీ కనిపించేలా పచ్చ పొడిపించుకున్నారు. ఒకరి పేరును ఒకరిచేతిపై ఇలా టాటూ రూపంలో వేయించుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. ఈ దంపతుల ఆలోచన సూపర్‌గా ఉంది కదూ...

పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డిల వివాహం మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

English summary
Allu Arjun tattooed Sneha's name on his hand. Sneha Reddy also tattooed Allu Arjun's name on his hand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu