»   » హత్తుకునేలా ఉందంటూ అభినందించిన అల్లు అర్జున్‌

హత్తుకునేలా ఉందంటూ అభినందించిన అల్లు అర్జున్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'కుమారి 21ఎఫ్‌' చిత్రానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా స్త్టెలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చిత్ర యూనిట్ అభినందించారు. 'కుమారి 21ఎఫ్‌' చక్కగా ఉందంటూ... ట్విట్టర్‌ ద్వారా ట్వీట్‌ చేశారు.

సినిమా కథ యువతకు చేరువగా, హృదయానికి హత్తుకునే రీతిలో ఉందంటూ ట్వీట్‌ చేశారు. రాజ్‌తరుణ్‌, హెబ్బాపటేల్‌లు జంటగా సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'కుమారి 21ఎఫ్‌'. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సుకుమార్‌ సమర్పించారు.

Allu Arjun tweet about 'kumari 21F'

మరో ప్రక్క 'కుమారి 21ఎఫ్‌' విడుదలై విజయవంతంగా ప్రదర్శితమౌతున్న నేపద్యంలో జు. ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఎన్టీఆర్ స్నేహితులు సుకుమార్ మరియు మ్యుజిక్ డైరక్టర్ దేవిశ్రీ , రత్నవేలు పాల్గోన్నారు.

రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్, నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథ,స్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్.

English summary
Allu Arjun tweet: "#Kumari21F Congrats aryasukku itsRajTarun , ThisIsDSP , randy , entire team n dir prathap . Young , fun , bold , heart touching movie."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu