»   » అలీతో కామెడీ చేస్తున్న అల్లు శిరీష్ (ఫొటో)

అలీతో కామెడీ చేస్తున్న అల్లు శిరీష్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ రెండో కుమారుడు అల్లు శిరీష్‌, హాస్య నటుడు ఆలీ, దర్శకుడు పరశురాంలు ఓ చిత్ర షూటింగ్‌ సందర్భంగా సరదాగా తీసుకున్న ఓ ఫొటోని ఆలీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

Fun time on the sets with #AlluSirish and #Parasuram

Posted by Ali on 24 November 2015

గౌరవం, కొత్త జంట చిత్రాల్లో నటించిన అల్లు శిరీష్‌ ప్రస్తుతం పరుసరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలోదే ఈ స్టిల్. అల్లు అరవింద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇందుకోసం అల్లు శిరీష్ ...సిక్స్ ప్యాక్ కూడా చేసారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా అల్లు అరవింద్ భావించి రూపొందిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీలను టార్గెట్ చేసే విధంగా పరుశరామ్ ఈ చిత్రాన్ని రూపొందించాడని తెలుస్తోంది.

అల్లు శిరీష్ తాజా చిత్రం విషయానికి వస్తే... గౌరవం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్‌కు ఆ చిత్రం పెద్దగా కలిసిరాలేదు. ఆ తరువాత క్రేజీ దర్శకుడు మారుతి దర్శకత్వంలో వచ్చిన కొత్తజంటతో కూడా ఆకట్టుకోలేకపోయాడు. కనీసం ఈసారైనా హీరోగా తన సత్తా చాటాలని రెడీ అయ్యాడు శిరీష్.

Allu Sirish fun with Ali

కొత్త లుక్‌తో కనిపించడం కోసం జిమ్‌లో కుస్తీలు పడుతున్నాడు. శిరీష్ హీరోగా నటించే ఈ చిత్రానికి సోలో ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిదా చౌదరి ఎన్నికైనట్టు తెలిసింది. ఈమె సూర్య వర్సెస్ సూర్యలో హీరోయిన్‌గా నటించింది.

అలాగే.. త్వరలో నిర్వహించనున్న ఐఫా ఉత్సవం అవార్డ్స్‌ ప్రధానోత్సవంలో తెలుగు విభాగానికి అల్లు శిరీష్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

English summary
Ali Fun time on the sets with ‪#‎AlluSirish‬ and ‪#‎Parasuram‬
Please Wait while comments are loading...