»   » ఎఫైర్ ఉంటే చాలట: మెగా ఫ్యామిలీ హీరో ట్వీట్స్ వైరల్

ఎఫైర్ ఉంటే చాలట: మెగా ఫ్యామిలీ హీరో ట్వీట్స్ వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్ అల్లు శిరీష్ ట్విట్టర్లో చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి గురించి అతడికి, అయన ట్విట్టర్ ఫాలోవర్స్‌కు జరిగిన ఈ సంభాషణలో శిరీష్ ఆసక్తికరంగా స్పందించారు.

తనకు వర్షం నచ్చదని, అది తనకు రొమాంటిక్‌ ఫీల్ కలిగించదని, ఆకాశంలో సూర్యుడు లేకపోవడం, నల్ల మబ్బులు కమ్ముకోవడం తనను డల్‌గా చేస్తాయని అల్లు శిరీష్ ట్వీట్ చేయడంతో ఈ కన్వర్జేషన్ మొదలైంది.

గత జన్మలో పకోడీలు వేశారా?

శిరీష్ చేసిన ట్వీటుకు ఓ ఫ్యాన్స్ స్పందిస్తూ.... అభిమాని ‘గత జన్మలో మీరు గృహిణి అయ్యి ఉంటారు. ఇంట్లో మీ భర్తకు బజ్జీలు, పకోడీలు చేసి ఉంటారు. అందుకే మీకు ఈ జన్మలో ఆ మబ్బులన్నా, వర్షం అన్నా చిరాకొస్తుందేమో అని ట్వీట్ చేశాడు.

నాకు అభ్యంతరం లేదు

దీనికి శిరీష్‌ బదులిస్తూ. ‘అయ్యుండొచ్చు.. ఈ జన్మలో కూడా నా గర్ల్‌ఫ్రెండ్‌ సంపాదనతో జీవిస్తూ.. ఆమెకు వండిపెట్టడానికి నాకు అభ్యంతరం లేదు. హోమ్‌మేకర్‌ గా ఉండటం అంత సులభమైన పని కాదు' అని ట్వీట్‌ చేశారు.

పెళ్లి చేసుకో భయ్యా.

మరో అభిమాని శిరీష్ ట్వీటుకు స్పందిస్తూ.... ‘భయ్యా, మీకు పెళ్లీడు వచ్చింది. పెళ్లి చేసుకోండి, మీకు అంతా రొమాంటిక్‌గా అనిపిస్తుంది. రోడ్డు మీద బురద కూడా అందంగానే ఉంటుంది' అంటూ ఓ ట్వీట్ చేశాడు.

దానికి ఎఫైర్ ఉంటే చాలు

దీనికి శిరీష్‌ సమాధానం ఇస్తూ ‘ఎందుకు సర్‌? ఎందుకు!.. ఇప్పటికే ఈ వర్షం, ట్రాఫిక్‌తో సతమతమవుతున్నా. రొమాన్స్‌కి పెళ్లి అక్కర్లేదు. రిలేషన్‌షిప్‌(ఎఫైర్) చాలు' అని ట్వీట్‌ చేశారు.

English summary
Allu Sirish tweets goes viral. "Dunno why but I dislike rains! I find nothing romantic in it. No sun & the greyish clouds make me dull for no reason." Allu Sirish tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu