»   » స్వలింగాలకు పెళ్లెలా చేయాలో శాస్త్రాల్లో లేదయ్యా... ( ‘అమీ తుమీ’ ట్రైలర్)

స్వలింగాలకు పెళ్లెలా చేయాలో శాస్త్రాల్లో లేదయ్యా... ( ‘అమీ తుమీ’ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అడివి శేష్‌, అవసరాల శ్రీనివాస్‌ హీరోలుగా నటించిన 'అమీ తుమీ' జూన్‌ 1న విడుదల కానుంది. ఎ గ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కహాన్‌, కన్నన్‌ సమర్పిస్తున్నారు.కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు.

ట్రైలర్

తాజాగా ‘అమీ తుమీ' చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. కామెడీ, రొమాన్స్ కలగలిపి ఫుల్ ఎంటర్టెన్మెంట్ కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఫ్యామిలీ ఎంటర్టెనర్

ఫ్యామిలీ ఎంటర్టెనర్

ఈ మధ్య కాలంలో కామెడీ అంటే డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్య పదజాలంతో నిండిన సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇందులో మాత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించేలా నీట్ గా ఉండే డైలాగులు, మంచి కామెడీ సెన్స్ ఉన్న డైలాగులు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

నటీనటులు

నటీనటులు

అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్

కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

English summary
Ami Tumi is a romantic comedy entertainer written and directed by Indraganti Mohanakrishna and produced by K C Narasimha Rao while Mani Sharma scored music for this movie Adivi Sesh, Srinivas Avasarala, Eesha Rebba and Aditi Myakal are played the main lead roles along with VennelaKishore in supportingrole in this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu