»   » పాపం అమీ జాక్సన్.. ఒంటి మీద గుడ్డలే మిగిలాయట.. దిక్కుతోచని స్థితిలో..

పాపం అమీ జాక్సన్.. ఒంటి మీద గుడ్డలే మిగిలాయట.. దిక్కుతోచని స్థితిలో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నటి అమీ జాక్సన్‌ చేదు అనుభవం ఎదురైంది. ఓ షూటింగ్‌ కోసం ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్తుండగా చాలా కీలక వస్తువులు ఉన్న బ్యాగులను ఆమె కోల్పోయింది. కేవలం చేతిలో హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఉండటంతో దిక్కుతోచని పరిస్థితిలో మిగిలిపోయింది. ఒంటి మీద బట్టలతోనే ఉండటంతో బ్యాంకాక్‌లోని స్థానిక మార్కెట్‌లో తనకు కావల్సిన వస్తువులను, దస్తులను కొనుగోలు చేసింది. రెండు రోజుల తర్వాత ఎయిర్‌లైన్ అధికారులు తమ తప్పును సరిదిద్దుకొవడంతో తన బ్యాగులు తన వద్దకు చేరడం గమనార్హం.

నా లగేజి మరో చోటుకు

నా లగేజి మరో చోటుకు

దురదృష్ణవశాత్తూ నా లగేజి మరో చోటుకు పోయింది. ముంబై ఎయిర్‌పోర్టులో మరో విమానంలో నా లగేజి వెళ్లిపోయింది. దాని కోసం కనీసం రెండు రోజులు వేచి చూడాల్సి వచ్చింది. బ్యాంకాక్ మార్కెట్‌లో దుస్తులు, నాకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేశాను. నా లగేజీ మిస్ కావడం కొంత ఆశ్చర్యంగాను, మరికొంత బాధగాను అనిపించింది.

ముంబై నుంచి బ్యాంకాక్

ముంబై నుంచి బ్యాంకాక్

ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకొన్నది. నా ట్రావెలింగ్ అనుభవంలో ఇలా జరుగడం ఇదే తొలిసారి అని అమీ జాక్సన్ తెలిపింది

సినిమా షూటింగ్ కోసం

సినిమా షూటింగ్ కోసం

సినిమా షూటింగ్ కోసం థాయ్‌లాండ్ వచ్చాను. చాలా సార్లు ఈ ప్రాంతానికి వచ్చాను. కానీ ఇలా జరుగడం మొట్టమొదటిసారి. షూటింగ్ సమయంలో లగేజ్ పోవడం వల్ల చాలా చిరాకు పడ్డాను.

మరో విమానంలో

మరో విమానంలో

నా లగేజ్ పొరపాటున మరో విమానంలో పంపించారు. నేను చేసిన ఫిర్యాదు పరిగణనలోకి తీసుకొని లగేజి గురించి వెతికారు. అధికారులు వేగంగా స్పందించడంతో నాకు చాలా వరకు కష్టాలు తొలగిపోయాయి. ఎందుకంటే షూటింగ్ కావాల్సిన మెటీరియల్ అంతా నా లగేజీలోనే ఉంది

ఒక్కోసారి హ్యాండ్ బాగ్

ఒక్కోసారి హ్యాండ్ బాగ్

ఒక్కోసారి హ్యాండ్ బాగ్ కూడా అందులోనే వేస్తాను. ఒకవేళ హ్యాండ్ బాగ్ కూడా అందులో ఉండి ఉంటే మరిన్ని కష్టాలు పడాల్సి వచ్చేది.

లగేజీ పోవడం వల్ల

లగేజీ పోవడం వల్ల

లగేజీ పోవడం వల్ల బ్యాంకాక్ మార్కెట్‌ను సందర్శించే అవకాశం కలిగింది. దుస్తులకు సంబంధించిన షాప్స్ చాలా బాగా ఉన్నాయి. మంచి డ్రస్సెస్ కొనుగోలు చేసే అవకాశం కలిగింది.

రెండో రోజే నా లగేజ్

రెండో రోజే నా లగేజ్

రెండో రోజే నా లగేజ్ నాకు చేరడంతో చాలా సంతోషం వేసింది. ఎయిర్ పోర్ట్ అధికారులకు థ్యాంక్స్ చెప్పాను. వారు కూడా పొరపాటుకు క్షమించమని కోరారు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయని సర్ధిపెట్టుకొన్నాను.

లగేజ్ పోయిందనే వార్త

లగేజ్ పోయిందనే వార్త

లగేజ్ పోయిందనే వార్త తెలియగానే కంగారు పడలేదు. అర్జెంట్‌గా షూటింగ్‌కు కావాల్సిందేంటని ఆలోచించాను. దాని ప్రకారం నాకు కావాల్సిన కొనుగోలు చేశాను. దాంతో పెద్దగా కష్టమేమీ అనిపించలేదు.

షూటింగ్‌కు అవాంతరం

షూటింగ్‌కు అవాంతరం

షూటింగ్‌కు అవాంతరం కలుగకుండా చర్యలు తీసుకొన్న అమీ జాక్సన్‌పై చిత్ర యూనిట్ ప్రశంసలు వ్యక్తం చేసింది.

విమానంలో లగేజ్

విమానంలో లగేజ్

విమానంలో లగేజ్ పోవడమనేది అదో కొత్త రకమైన అనుభవం. మరోసారి అలాంటి పరిస్థితి రావొద్దని కోరుకొంటున్నాను అని అమీ జాక్సన్ తెలిపింది.

English summary
Amy Jackson flew to Bangkok from Mumbai for a shoot and the airline misplaced her luggage and upon landing, she was left with nothing except her handbag. Amy, then continued with her shoot and also went shopping at the local Bangkok market and brought herself some new outfits. Two days later she realised that the airline had mistakenly sent her luggage to a completely different city and thankfully, they traced it back and handed it over to her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu