»   » అమీజాక్సన్ బికినీలు అమ్ముతుందట : బ్రిటన్ బ్యూటీ కొత్త వ్యాపారం

అమీజాక్సన్ బికినీలు అమ్ముతుందట : బ్రిటన్ బ్యూటీ కొత్త వ్యాపారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం గతం లో తారలకు పెద్దగా అలవాటుండేది కాదు వచ్చిన డబ్బు ని ఎలా మేనేజ్ చేసుకోవాలో అర్థం కాక చివరకు ఉన్నదంతా పోగొట్టుకొని హీన స్థితికి చేరుకున్న ఎందరో తారలు మనకు కనిపిస్తారు. అయితే ఆ తప్పు ఈతరం తారలు చేయటం లేదు వీలైనంత వరకూ ఏదో ఒక రంగం లో పెట్టుబడులు పెట్టటమో లేదా తమ సొంత రెస్టారెంట్, జిమ్, బ్యూటీపార్లర్ ఇలా ఏదో ఒక రంగం లోకి తమ లాభాలని మళ్ళిస్తున్నారు.

అమీ జాక్సన్

అమీ జాక్సన్

ఇలా ఏప్పటికే సినిమాల్లో తెగ వెలిగిపోతున్న బ్రిటీష్ అందం అమీ జాక్సన్.. ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలుపెట్టేస్తోంది. తనకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టిన బికినీలతోనే ఈ బ్యూటీ బిజినెస్ స్టార్ట్ చేసేస్తుండడం విశేషం. టూర్లు తిరగడం అంటే మహా ఇష్టపడే ఈ భామ. రీసెంట్ గా సమ్మర్ లో ఇలాంటి షికార్లే కొట్టింది.

Amy Jackson Has Nothing To Wear As She Loses Her Bag On The Way To Bangkok
బికినీ వేర్ దొరకలేదట

బికినీ వేర్ దొరకలేదట

ఆ సమయంలో ఈమెకు నచ్చినట్లుగా బికినీ వేర్ దొరకలేదట. అప్పుడు వచ్చిన ఐడియాను పట్టుకుని. వ్యాపారం ఆలోచన చేసిందట. అయితే మేడం కి ఇలాంటి ఐడియాలు కొత్తేమీ కాదు ఆమధ్య లండన్ లో హొటల్ ఓపెన్ చేస్తున్నా అంటూ హడావుడి చేసింది మళ్ళీ ఆ ఊసే లేదు...

విగ్గుల వ్యాపారం

విగ్గుల వ్యాపారం

తర్వాత అదేదో విగ్గుల వ్యాపారం అంది (వినటానికి అదోలా ఉనా మాంచి డిమాండ్ ఉన్న రంగమే) అదీ పక్కకు పోయింది. ఇక ఇప్పుడేమో బికినీ మార్కెట్ లో దొరక్క పోయే సరికి ఇప్పుడు కొత్త గా ఈ పాట మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ ఇంకా మేకింగ్ లోనే ఉన్నా.. త్వరలోనే యామీ అమ్మే బికినీలు మార్కెట్లోకి వచ్చేయడం ఖాయమే.

సింగిల్ పీస్ కాస్ట్యూమ్స్

సింగిల్ పీస్ కాస్ట్యూమ్స్

వీటిలో కవర్-అప్స్.. బికినీలు.. సింగిల్ పీస్ కాస్ట్యూమ్స్ ఉంటాయంటోంది.పైగా వీటిని చవకధరల్లోనే విక్రయిస్తామని యామీ జాక్సన్ చెబుతుండడం విశేషం. 'తనకు ఏది తగిన డ్రెస్ అనే విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రతీ మహిళకు ఉంది. నగ్నంగా తిరగాలని కోరుకున్నా అది వారి వ్యక్తిగత ఇష్టమే.

వ్యక్తిగత ఇష్టమే

వ్యక్తిగత ఇష్టమే

ఎవరూ ప్రశ్నించడానికి.. జడ్జ్ చేయడానికి అవకాశం లేదు. బట్టలు ఒకరి కోసం వేసుకునేవి కావు.. వారి కంఫర్ట్ కోసం వేసుకుంటారు. వ్యక్తిగత ఇష్టమే ఎలాంటి దుస్తులు వేసుకోవాలనే అంశాన్ని నిర్ణయించాలి' అంటూ స్ట్రాంగ్ క్లాస్ పీకినట్లుగా చెప్పింది అమీ జాక్సన్. ఏదేమైనా మార్కెట్లోకి జాక్సన్ బికినీ వచ్చేవరకూ నమ్మటానికి లేదీ తెల్ల పిల్లని

English summary
Britan beauty Amy Jackson to Open her new start up With Bikini market.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu