»   »  కుటుంబ వివాదంలో ....ఝాన్సీ

కుటుంబ వివాదంలో ....ఝాన్సీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jhansi
టీవీ యాంకర్‌ ఝాన్సీ.. భర్త జోగినాయుడు లమధ్య వివాదం మళ్ళీ రాజుకుంది. తన కుమార్తెను చూడనివ్వకుండా తన అత్తమామలు, బావమరిది తనకు అన్యాయం చేస్తున్నారని జోగినాయుడు ఆరోపించారు. తమ కుమార్తెను ప్రతి ఆదివారం మూడు గంటల పాటు తనకు చూపించాలని కోర్టు ఆదేశించినా వారు ఖాతరు చేయడంలేదన్నారు. తన కుమార్తె కోసం వారి ఇంటికి వెళ్ళినప్పుడు తన అత్తామామలు. బావమరిది ఒక హంతకుడిని చూసినట్లు తనను చూసి ఇంటి నుంచి బయటికి నెట్టివేశారని జోగినాయుడు ఆరోపిస్తున్నారు. తమ మధ్య చోటు చేసుకున్న సంఘటనలు గురించి జోగినాయుడు ఓ ప్రెవేటు టి.వి.న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు.

తనది ప్రేమ వివాహమని...తమ పెళ్ళయిన మొదట్లో ఝాన్సీని తమ అత్తమామలు వారి ఇంటికి కూడా రానిచ్చేవారు . కాదని జోగినాయుడు చెప్పారు. అలాగే ఝాన్సీ కూడా పుట్టింటికి వెళ్ళేది కాదన్నారు. తమకు కూతురు పుట్టినప్పుడు కూడా తమను చేరనివ్వని వారు రెండేళ్ళక్రితం ఝాన్సీకి మాయమాటలు చెప్పి ఆమె మనస్సు విరిచేశారని ఆయన తెలిపారు. పాపపుట్టిన ఏడాది కాలం వరకూ ఝాన్సీయే ఆమెను సంరక్షించిందని, అనంతరం షూటింగ్‌లతో ఝాన్సీ బిజీ ఉండంతో తాను చూసుకునేవాడినని తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు తనకు,ఝాన్సీకి మధ్య దూరం పెంచారని.. వాపోయారు. పెళ్ళయి పన్నేండేళ్లు గడిచినా.. ఇప్పుటికీ ఆమె తనని అర్ధం చేసుకోలేకపోయిందని...ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే కుటుంబాల్లో మామూలుగా తలెత్తే చిన్న చిన్న విభేధాలు ఉన్న మాట నిజమే అని జోగినాయుడు ఒప్పుకున్నారు. కాని అవి విడాకులు తీసుకోవలసినంత పెద్దవి కాదన్నారు. తమ మధ్య విభేదాలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేవే అయినా ఝాన్సీ అందుకు ఇష్టపడడంలేదని జోగినాయుడు వాపోయారు. తమ ఇద్దరి మధ్య తమ కూతురు అన్యాయం కాకుడదన్నదే తన తాపత్రయం అన్నారు. తాను ఝాన్సీ కలిసి ఉంటేనే తమ కుమార్తె సంతోషంగా ఉండగలుగుతుందని జోగినాయుడు పేర్కొన్నారు. ఝాన్సీతో కలిసి ఉండాలన్నదే తన అభిప్రాయం అని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X