»   » నేను కెలుకుతనే ఉంటా? అనసూయ సాక్ష్యం ఏది? సంక లేపగానే రెడీగా ఉండాలా?... యాంకర్ రవి

నేను కెలుకుతనే ఉంటా? అనసూయ సాక్ష్యం ఏది? సంక లేపగానే రెడీగా ఉండాలా?... యాంకర్ రవి

Posted By:
Subscribe to Filmibeat Telugu
రేటింగ్ పెరగడానికి నేను శ్రీముఖి ఎంతవరకయినా వెళ్తాం ! క్లారిటీ వస్తే ఇంకేముంటది ?

తెలుగు టీవీ రంగంలో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకెలుతున్న వారిలో యాంకర్ రవి ఒకరు. పాపులారిటీతో పాటు పలు వివాదాలు రవి చుట్టూ ఉన్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో వివాదాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవ్వగా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు రవి.

శ్రీముఖితో డేటింగ్, పెళ్లిపై

శ్రీముఖితో డేటింగ్, పెళ్లిపై

శ్రీముఖితో డేటింగులో ఉన్నారు, మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారు అనే వార్తలపై స్పందిస్తూ...... అవునండీ మాకు పిల్లలు కూడా ఉన్నారు, ఒకడు హాస్టల్ లో టెన్త్ క్లాస్ కూడా చదువుతున్నాడు అంటూ ఎటగకారంగా.... కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారేంటి? అంటూ రవి సమాధానం ఇచ్చారు.

మా గురించి అలా మాట్లాడుకోవాలనే

మా గురించి అలా మాట్లాడుకోవాలనే

మా గురించి అంతా అలా మాట్లాడుకోవడానికే మేము చాలా క్లోజ్‌గా ఉన్నట్లు యాక్ట్ చేస్తాం. ఇదంతా మేము చేస్తున్న పటాస్ టీవీ షోకు వ్యూవర్ షిప్ పెంచడం కోసమే. మా ప్రవర్తన చూసిన వారంతా మేము లవర్సా? మొగుడు పెళ్లాలా? ఫ్రెండ్సా? కో యాంకర్సా? ఏమిటో అర్థం కాకుండా తికమక పడాలి. మా మధ్య సంబంధం ఏమిటో తెలిసుకోవడానికి చాలా మంది మా పటాష్ షో చూస్తారు.... అని రవి తెలిపారు.

మాకు రేటింగ్ కావాలి, అందుకోసం ఏమైనా చేస్తాం

మాకు రేటింగ్ కావాలి, అందుకోసం ఏమైనా చేస్తాం

మాకు కావాల్సింది మా ఇద్దరి గురించి రకరకాలుగా మాట్లాడుకోవడమే.... అప్పుడే మా షోకు రేటింగ్ పెరుగుతుంది. మా ఇద్దరి మధ్య ఏముంది అనే విషయంలో క్లారిటీ ఇస్తే మాకేంటి లాభం? క్లారిటీ వస్తే పటాష్ షో ఎవరూ చూడరు... అంటూ రవి చెప్పుకొచ్చారు.

నేను కెలుకుతూనే ఉంటా

నేను కెలుకుతూనే ఉంటా

నేను కెలుకుతూనే ఉంటా... నువ్వు రావాలి చూడాలి....నేను కెలుకుతూనే ఉంటా... నువ్వు రావాలి చూడాలి.... ఇదే సింపుల్ లాజిక్. అందుకే శ్రీముఖి, నేను అలా ప్రవర్తిస్తూ ఉంటాం అని యాంకర్ రవి చెప్పుకొచ్చారు.

పెళ్లి కాలేదని నిరూపిస్తే మీరు చేసుకుంటారా?

పెళ్లి కాలేదని నిరూపిస్తే మీరు చేసుకుంటారా?

మీకు పెళ్లయిందని ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ప్రూఫ్స్, ఫోటోలు ఉన్నాయనే ప్రశ్నకు రవి స్పందిస్తూ ..... కాలేదని నిరూపిస్తే మీరు చేసుకుంటరా? అది నా పర్సనల్ లైఫ్ అంటూ యాంకర్‌ను ఎదరు ప్రవ్నించాడు యాంకర్ రవి.

నా షోలలో బూతు లేదు

నా షోలలో బూతు లేదు

ఫ్యామిలీతో చూసే విధంగా నా షోలు లేవు అనడం సరికాదు. నా షోలలో బూతు లేదు. ఏదో ఊహించుకుని ఉందని చాలా మంది అనుకుంటున్నారు. కావాలంటే నేను నిరూపిస్తాను అంటూ.... ఓ ప్రశ్నకు రవి సమాధానం ఇచ్చారు.

ప్రభాకర్‌తో గొడవ గురించి

ప్రభాకర్‌తో గొడవ గురించి

ప్రభాకర్ గారితో గొడవ అంతా నాటకం. సూపర్ సీరియల్ చాంపియన్ షిప్ అనే కార్యక్రమం కోసం ముందుగా మేము అనుకుని చేశాం. రేటింగ్ కోసమే చేశాం. ఎవరికీ తెలియకుండా మేము ఇద్దరం ముందే అనుకుని చేశాం. కానీ ఎవర్వరూ నమ్మలేదు. ఈ విషయం ఇపుడు ఎందుకు చెబుతున్నానంటే ఆ షో సల్లపడిపోయింది. అందుకే చెబుతున్నాను.... అని రవి తెలిపారు.

యాంకర్ల పట్ల దారుణంగా

యాంకర్ల పట్ల దారుణంగా

యాంకర్స్ గురించి కొందరు సోషల్ మీడియాలో చాలా దారుణంగా రాస్తున్నారు. ప్రదీప్ గురించి వచ్చిన వార్తలు విని షాకయ్యాను. ఆయన ఆత్మహత్యయత్నం అని రాశారు. ఇలాంటి వింటే ఎవరికైనా కోపం వస్తుంది... అని యాంకర్ రవి తెలిపారు.

అనసూయకు సాక్ష్యం ఉందా?

అనసూయకు సాక్ష్యం ఉందా?

అనసూయ ఫోన్ పగల కొట్టింది అంటూ నానా యాగీ చేశారు. అసలు అనసూయ ఫోన్ పగలగొట్టలేదు. పగలగొట్టింది అనడానికి ఏమైనా వీడియో సాక్ష్యం ఉందా? అంటూ ఓ ప్రశ్నకు రవి ఎదురు సమాధానం ఇచ్చారు.

సంక లేపగానే రెడీగా ఉండాలా?

సంక లేపగానే రెడీగా ఉండాలా?

ఇటీవల నేను ఏదో టెన్షన్లో ఫోన్ మాట్లాడుతున్నా. కొందరు వచ్చి నా కార్ డోర్ కొట్టి సెల్పీ ఇవ్వాలంటూ బలవంతం చేశారు. ఇపుడు కుదరదు ఫోన్లో బిజీగా ఉన్నాను వెళ్లమని చెప్పగానే....వీడియో తీయడం ప్రారంభించారు. ఇపుడు అందరికీ సెల్పీ పిచ్చి పట్టుకుంది. ఇవ్వకపోతే విలన్స్ లా చూస్తున్నారు. ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? మొహం మూతి తెలియనోడు సంక లేపుతడు, చెంపపెట్టేసి ఇలా లాగి ఫోటో దిగు అని డిమాండ్ చేస్తడు. ఏంటిది? ఇవ్వకపోతే పొగరు..మీ అందరి కోసం మేమంతా నవ్వకుంటూ రెడీగా ఉండాలా? మాకు పర్సనల్ లేదా? బాధలు లేవా? అంటూ రవి ఫైర్ అయ్యారు.

English summary
Anchor Ravi interesting comments about selfie poses. Ravi also said about his personal life issues Being an anchor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu