For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘మాతో పడుకుంటే నీకు సినిమా అవకాశం’.. సెక్స్ కుంభకోణంపై అండ్రియా సీరియస్ (ఇంటర్వ్యూ)

  By Rajababu
  |
  ఎవరితో పడుకుంటే మీకెందుకు?

  ఆండ్రియా జెర్మియా మంచి గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు. మంచి గాయని. సంగీత, నృత్యకారిణి. తెలుగులో దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఎన్టీఆర్ చిత్రం రాఖీలో జర జరా అంటూ సంగీత ప్రియులను పిచ్చెక్కించారు. నటిగా రాణిస్తూనే తాజాగా గృహం చిత్రంలో తన గళాన్ని మరోసారి సవరించుకొన్నారు. ప్రస్తుతం హీరో విశాల్‌తో కలిసి డిటెక్టివ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం నవంబర్ 10న విడుదల కానున్న నేపథ్యంలో ఆమె తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఆండ్రియా చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

  అద్భుతంగా డిటెక్టివ్

  అద్భుతంగా డిటెక్టివ్

  తిరుప్పవాలన్ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. అదే చిత్రాన్ని తెలుగులో డిటెక్టివ్ చిత్రంగా డబ్బింగ్ అవుతున్నది. మర్డర్ మిస్టరీ డిటెక్టివ్‌ను దర్శకుడు మిస్కిన్‌ అద్భుతంగా తెరకెక్కించాడు. నటీనటుల ఎంపిక చాలా బాగుంది. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా చూస్తున్న సేపు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నేను హంతకురాలిగా నటిస్తున్నాను. నా కెరీర్‌లో ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో డిఫరెంట్.

   డిటెక్టివ్ సక్సెస్ అవుతుంది..

  డిటెక్టివ్ సక్సెస్ అవుతుంది..

  థ్రిల్లింగ్‌ డిటెక్టివ్‌ మూవీ. డైరెక్టర్‌ మిస్కిన్‌ ఓ కల్ట్‌ డైరెక్టర్‌. సినిమా తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. నవంబర్‌ 10న విడుదల కానున్న ఈ సినిమా తెలుగులో కూడా మంచి సక్సెస్‌ను సాధిస్తుందనే నమ్మకముంది. ఈ సినిమాలో నేను గ్రే షేడ్స్‌ ఉన్న పాత్ర చేశాను. నా పాత్ర కోసం యాక్షన్‌ సీక్వెన్స్‌ కష్టపడి నేర్చుకున్నాను.

  డిటెక్టివ్ చిత్రాలు అరుదుగా

  డిటెక్టివ్ చిత్రాలు అరుదుగా

  దక్షిణాది సినిమా పరిశ్రమలో డిటెక్టివ్ తరహా చిత్రాలు రావడం చాలా అరుదు. విభిన్నమైన చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ మధ్య వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం కూడా ఓ డిఫెరెంట్ సినిమా. ఆ చిత్రాన్ని ఆదరించడం ప్రేక్షకుల అభిరుచికి అద్దం పట్టింది.

   హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ నడిపా..

  హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ నడిపా..

  అలాగే సినిమా కోసం హార్లీ డేవిడ్‌ సన్‌ బైక్‌ను నడపడం నేర్చుకున్నాను. అంత హెవీ బైక్‌ను నడపటం చాలా కష్టమైంది. కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడ్డాను. చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. కానీ అంతగా గాయాలు కాలేదు. ఇక అంత పెద్ద బైక్ నడిపే సినిమాలు ఇక చేయను.

   మూడు విభిన్న చిత్రాల్లో..

  మూడు విభిన్న చిత్రాల్లో..

  నన్ను ఎగ్జయిట్‌ చేసే ఎలిమెంట్స్‌ ఉన్నప్పుడే సినిమాలు చేస్తాను. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు విడుదల కానున్నాయి. 'డిటెక్టివ్‌' చిత్రం అందులో ఒకటి. అలాగే 'తారామణి', 'గృహం' చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలు నా కెరీర్‌కు బాగా తోడ్పాటునందిస్తాయి. మంచి పాత్రలు వస్తే తెలుగులో కూడా చేయడానికి నేను సిద్ధం అని ఆండ్రియా అన్నారు.

   గ్లామర్ పాత్రలు వదులుకోను

  గ్లామర్ పాత్రలు వదులుకోను

  విభిన్నమైన పాత్రల కోసం గ్లామర్ రోల్స్ వదులుకోను. గ్లామర్ హీరోయిన్ పాత్రలతోపాటు నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లు, గృహిణి పాత్రలు పోషించడానికి వెనుకాడను. తారామణి, గృహం చిత్రాలు అందుకు సాక్ష్యం. నేను అన్ని రకాల పాత్రలు పోషిస్తాను. తెలుగు మంచి పాత్ర లభిస్తే నటించడానికి ఎల్లవేళలా నేను సిద్ధం.

   ఫైట్స్ చేయాలంటే భయం లేదు..

  ఫైట్స్ చేయాలంటే భయం లేదు..

  ఈ చిత్రంలో యాక్షన్ సీన్ల నేను నటించాను. నాకు ఫైట్స్ చేయడమంటే భయం లేదు. కేవలం నాకు జిల్ల పురుగులు అంటే చాలా భయం. విశాల్‌తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. విశాల్ చాలా కష్టపడి పనిచేస్తాడు. సినిమా కోసం ప్రాణాలు కూడా పెడుతాడు. అని అండ్రియా చెప్పింది.

   రాఖీ చిత్రంలో జర జరా

  రాఖీ చిత్రంలో జర జరా

  గృహం చిత్రం కోసం ఓ పాట పాడాను. గతంలో ఎన్టీఆర్ నటించిన రాఖీ చిత్రంలో జర జరా అనే పాటను పాడాను. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌తో పదేళ్లకు పైగా మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. దేవీ శ్రీ క్రియేటివిటి అంటే చాలా ఇష్టం అని అండ్రియా తెలిపింది.

   సోషల్ మీడియాలో యాక్టివ్ కాదు

  సోషల్ మీడియాలో యాక్టివ్ కాదు

  నేను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండను. ఫేస్‌బుక్, ట్విట్టర్ ఎక్కువగా ఉపయోగించను. #metoo అనే ట్యాగ్ గురించి ఎక్కువగా తెలియదు అని అండ్రియా వెల్లడించింది. వేషాల కోసం పడుక గదిలోకి రమ్మంటారనే అంశానికి #metoo ట్యాగ్ సంబంధించింది అనే వివరణ ఇవ్వగా.. ఆ అంశంపై అండ్రియా తీవ్రంగా స్పందించింది.

   నాకు అలాంటి అనుభవం లేదు..

  నాకు అలాంటి అనుభవం లేదు..

  హాలీవుడ్ దర్శకుడి సెక్స్ కుంభకోణంపై స్పందిస్తూ.. ఇప్పటి వరకు నాకు అలాంటి సంఘటనలు ఎదురు కాలేదు. నీవు మాతో పడుకుంటే నీకు సినిమా అవకాశం ఇస్తాం అని ఏ దర్శకుడు, నిర్మాత అడుగలేదు. అలా ఎవరైనా పిచ్చివేశాలు వస్తే చాలా సీరియస్‌గా స్పందిస్తాను. అలాంటి సినిమాలు నేను చేయను. నేను చేసే పనిమీద నాకు చాలా గౌరవం ఉంది. ప్రొఫెషనల్‌గా ఉంటాను.

   మగాడు బలవంత చేయకూడదు

  మగాడు బలవంత చేయకూడదు

  ఎవరి పక్కన పడుకోవాలి అనేది ఓ మహిళకు సంబంధించిన హక్కు, వ్యక్తిగతమైన విషయం అని నేను అంటాను. హీరోయిన్‌ గానీ, జర్నలిస్టుగానీ మరో ఏ రకమైనా ప్రొఫెషనల్ గానీ ఆ పని చేయాల్సి వస్తే ఆమెకు ఇష్టం ఉండాలి. ఆమె ఇష్ట ప్రకారమే జరుగాలి. అంతేగానీ ఆ పనిని చేయడానికి ఓ పురుషుడు బలవంతం చేయడాన్ని నేను ఒప్పుకోను.

  English summary
  Andrea Jeremiah speaks on casting couch. She said that Women has right to sleep whom she like. but men should not force any Women. Andrea comment become sensation in Telugu media. Her movie Detective with Vishal set release on November 10th. In this occassion, Andrea speaks to Telugu Filmibeat exclusively.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X