»   » అంజలి ఇరగతీస్తోంది(సెల్ఫీ ఫొటోలు)

అంజలి ఇరగతీస్తోంది(సెల్ఫీ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొద్ది రోజుల్లోనే హీరోయిన్ అంజలి ట్విట్టర్ లో సెల్ఫీలు అప్ లోడ్ చేయటంలో మాస్టర్ అయ్యిపోయింది. ఏదన్నా ప్రత్యేకమైన సందర్బం ఎదరైనప్పుడు వెంటనే ఆమె సెల్ఫీ తీసి ఇదిగో ఈ క్రింద ఫొటోలు తరహాలో తీసి తన మైక్రో బ్లాగింగ్ సైట్ లో పోస్ట్ చేస్తోంది. రీసెంట్ గా ఈ ఫొటోలను అప్ లోడ్ చేసి..." ధాంక్యూ సో మచ్..ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్...ఫీలింగ్ బ్లెసెడ్ ". అని రాసుకొచ్చింది.

Anjali taking selfies

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక అంజలి ఈ మధ్యన రాంగ్ కారణాలతో మీడియాకు ఎక్కింది. హైదరాబాద్ లో ని ఓ పబ్ లో మధ్యం మత్తులో సినీ నటి అంజలి హల్ చల్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1 లోని తబల పబ్ కు శుక్రవారం రాత్రి అంజలి తన స్నేహితులతో కలిసి వచ్చింది. అందరూ కలిసి మధ్యం సేవించి, అనంతంరం డాన్స్ ఫ్లోర్ వద్దకు వెళ్లేందుకు సిద్దమయ్యారు.

అదే సమయంలో ఓ యువకుడు అంజలికి అడ్డువచ్చాడు. దీంతో మధ్యం మత్తులో ఉన్న అంజలి అతన్ని తిట్టడంతో పాటు నిర్వాహకులపైనా తిట్ల దండంకం ప్రారంభించింది. పరిస్ధితి శ్రుతిమించటంతో నిర్వాకులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో పంజాగుట్ట పోలీసులు పబ్ కి వెళ్లి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఇదంతా ట్రాష్ అని మీడియా సృష్టించిన మ్యాటర్ అని తర్వాత రోజు ఆమె కొట్టిపారేసింది.

అంజలి కెరీర్ విషయానికి వస్తే...

కోన వెంకట్ నిర్మాణ సారధ్యంలో రూపొందిన 'గీతాంజలి'లో అందర్నీ భయపెట్టిన తెలుగమ్మాయి అంజలి. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు థ్రిల్‌ కలిగించడానికి సిద్ధమవుతోంది. అంజలి ప్రధాన పాత్రలో విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'పిల్ల జమిందార్‌'తో ఆకట్టుకొన్న అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. అమెరికాలో చిత్రీకరణ జరుగుతోంది. జనవరి 10 వరకు అక్కడే కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఇది ఉత్కంఠ, వినోదం జోనర్‌లో సాగే చిత్రమని తెలుస్తోంది.

Anjali taking selfies

భాగమతి అనే పేరుతో రూపొందనున్న ఈ సినిమాలోని టైటిల్ పాత్రలో అనుష్క నటించనుందని తొలుత ప్రచారం జరిగింది. ప్రస్తుతం అనుష్క బాహుబలి, రుద్రమదేవి చిత్రాలతో బిజీగా వుండటం వల్ల ఆ స్థానంలో అంజలిని దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకున్నారని తెలిసింది. ఆసక్తికరమైన కథ, అభినయానికి ఆస్కారం వుండటంతో అంజలి ఈ సినిమాలో నటిండానికి సుముఖత వ్యక్తం చేసిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ అంజలి. ఆ తర్వాత తను చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈ సంవత్సరం అంజలి చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘గీతాంజలి' పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలకే కాకుండా లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ కి కూడా బాగా సరిపోతుందని పేరొచ్చింది. దాంతో అంజలికి మళ్ళీ వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలే అంజలి మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తేలియజేశాం.

ఆ సినిమాకి భాగమతి అనే టైటిల్ ని ఖరారు చేసారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కోసం అంజలి కోటి రూపాయల దాకా పారితోషికం తీసుకున్నట్లు అంటున్నారు. దీన్ని బట్టి సక్సెస్ ఉన్నప్పుడే నాలు రాళ్ళు వెనకేసుకోవాలనే ఫార్ములాని అంజలి బాగా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ‘పిల్లా జమిందార్' ఫేం అశోక్ దర్శకత్వం వహిచబోయే తాజా సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తారు.

English summary
Anjali tweeted: "Thank you sooooo much fr all your luv n affection .. Feeling blessed". Anjali taking selfies and using social media in a best possible manner to expand her fan base.
Please Wait while comments are loading...