»   » మళ్లీ తండ్రి కాబోతున్న ఆనందంలో అల్లు అర్జున్ (ప్రెగ్నెన్సీ ఫోటోస్)

మళ్లీ తండ్రి కాబోతున్న ఆనందంలో అల్లు అర్జున్ (ప్రెగ్నెన్సీ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ తండ్రి కాబోతున్నాడనే విషయం తెలంగాణ ప్రభుత్వం హరిత హారం కార్యక్రమం చేపట్టిన సమయంలోనే తెలిసిపోయింది. ఆ సమయంలో ఆయనతో పాటు హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న భార్య స్నేహా రెడ్డి బేబీబంప్ తో కనపడటంతో విషయం లీక్ అయింది.

ఇపుడు ఈ విషయాన్ని అఫీషియల్ గా ఖరారు చేస్తూ అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసారు. మా కుటుంబంలోకి త్వరలో మరో బేబీ రాబోతోంది. ఈ విషయం అభిమానులతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది అంటూ బన్నీ తెలిపారు. దీంతో పాటు స్నేహారెడ్డి ప్రెగ్నెన్సీ ఫోటోను కూడా పోస్టు చేసారు.

పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4, 2014న అయాన్ జన్మించాడు.

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ.... బన్నీ-స్నహారెడ్డి మరో బిడ్డకు ప్లాన్ చేసుకున్నారు. మరికొన్ని నెలల్లో మనం శుభవార్త వినబోతున్నాం.స్లైడ్ షోలో స్నేహారెడ్డి బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు....

అఫీషియల్ గా..

అఫీషియల్ గా..

స్నేహారెడ్డి మరో బిడ్డకు జన్మనిస్తున్న విషయాన్ని అల్లు అర్జున్ అఫీషియల్ గా ఖరారు చేస్తూ ఈ ఫోటో పోస్టు చేసారు.

అప్పుడే అనుమానం

అప్పుడే అనుమానం

హరిత హారం సమయంలో స్నేహారెడ్డి బేబీ బంప్ తో కనిపించడంతో అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది.

గతంలో కూడా..

గతంలో కూడా..

గతంలో అయాన్ కడుపులో ఉన్న సమయంలో కూడా అల్లు అర్జున్ ఇలా తన భార్య ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

అల్లు అర్జున్-స్నేహారెడ్డి లవ్ మ్యారేజ్... కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

హ్యాపీ లైఫ్

హ్యాపీ లైఫ్

బన్నీ, స్నేహారెడ్డి అన్యోన్యంగా జీవిస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

విదేశాల్లో..

విదేశాల్లో..

విదేశాల్లో షూటింగ్ సమయంలో బన్నీతో కలిసి స్నేహారెడ్డి

స్వీట్ మెమొరీస్

స్వీట్ మెమొరీస్

ఒక వయసొచ్చాక తమ జీవితంలో గడిచిపోయిన పేజీలను తిరిగి చూసుకోవాలంటే...ఇలాంటి స్వీట్ మెమొరీస్ ఉండాల్సిందే

English summary
"Happy to share that my family is growing a little bigger. Another baby arriving soon!" Allu Arjun said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu