»   » ఈ రోజు పవన్ వెనక నుంచి: ‘కాటమరాయుడు’ ... ఇంకో పోస్టర్ విడుదలైంది..చూసారా?

ఈ రోజు పవన్ వెనక నుంచి: ‘కాటమరాయుడు’ ... ఇంకో పోస్టర్ విడుదలైంది..చూసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ రీసెంట్ గా మొదలై శరవేగంతో జరుగుతున్న విషయం తెలిసిందే. కిశోర్ పార్థసాని (డాలీ)డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది.

ఈ సందర్భంగా పవన్‌ పంచెకట్టుతో మాస్‌ని ఆకర్షించేలా ఉన్న ఓ ఫొటోను నిన్న అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు వెనక నుంచి పవన్ వెళ్తున్న మరో ఫొటోని వదిలారు. ఇలా రోజుకో టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఈ రోజు రిలీజ్ చేసిన ఫొటోను మీరు ఇక్కడ చూడవచ్చు.నిర్మాత మాట్లాడుతూ ..చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చింది. గబ్బర్‌సింగ్ ఘనవిజయం తరువాత పవన్‌కల్యాణ్, శృతిహసన్‌ల కలయిక ఈ చిత్రంలో కనువిందు చేయబోతుంది. ఇటీవల పొల్లాచ్చిలో వీరిద్దరి కాంబినేషన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు, ఓ పాట అద్భుతంగా వచ్చాయి. పవన్‌కల్యాణ్ సినిమా అంటే ప్రేక్షకులు ఏం అశిస్తారో ఆ అంశాలన్నీ ఈ చిత్రంలో వుంటాయి అని తెలిపారు.


దర్శకుడు మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌తో రెండవసారి కలిసి పనిచేయడం ఆనందంగా వుంది. మిగిలిన చిత్రీకరణ అంతా జనవరి, ఫిబ్రవరిల్లో పూర్తిచేసి చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాదికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.


ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 29, 2017న కాటమరాయుడు సినిమాను విడుదల చేయనున్నట్లు టీమ్ తెలిపింది. ఇక కాటమరాయుడు మార్చికి ఫిక్స్ అయిపోవడంతో మిగతా సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయన్నది చూడాలి.


ఇక ఈ చిత్రం తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన 'వీరమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ రీమేక్ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ అయితే చేయలేదు కానీ పవన్ లుక్ మాత్రం తెల్ల షర్ట్, పంచతో అచ్చం అజిత్ వీరంలో ఉన్నట్లే ఉంది.


Another poster form Pawan's Katama Rayudu

అంతేకాదు... ఈ సినిమాలో హీరోయిన్.. ఒక మరదలు.. నలుగురు తమ్ముళ్ళు.. ఇలా ఆ సినిమాలో ఉన్న క్యారక్టర్లన్నీ తెలుగులో కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మరో ఇద్దరు చిన్న హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. అలాగే పెళ్ళిచూపులు ఫేం విజయ్.. మరో హీరో కమల్ కామరాజు.. పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్నారు.


శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శివబాలాజీ, అజయ్‌,కమల్‌ కామరాజు, అలీ, రావు రమేశ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


కాటమరాయుడులో శృతిహాసన్ రెండోసారి పవన్‌కు జోడీగా నటిస్తుంది. కన్నడ నటి మానసహిమవర్ష మరో కీలక పాత్రలో కనిపించనుంది.అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ.

English summary
Another poster form Pawan's Katama Rayudu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu