»   » ‘కాటమరాయుడు’సీక్రెట్స్ రివీల్ చేస్తూ వీడియో వదిలిన అనూప్ రూబెన్స్

‘కాటమరాయుడు’సీక్రెట్స్ రివీల్ చేస్తూ వీడియో వదిలిన అనూప్ రూబెన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అందరూ ఊహించినట్లుగావనే ... 'కాటమరాయుడు' సాంగ్ రిలీజ్ అయ్యి దుమ్ము రేపుతూ, ఎక్కడ చూసినా అది వినపిస్తోంది. 'రాయుడూ..' అంటూ ఇటీవల టీజర్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'మిరామిరా మీసం.. మెలి తిప్పాడు జన కోసం' అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేయటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ముఖ్యంగా కాటమరాయుడు చిత్రం మాస్ సినిమా లాకాకుండా... . ఇదొక మ్యూజికల్ సినిమా గా ప్రెజెంట్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. ఈ సినిమాలో కేవలం ఆరు పాటలే కాకుండా.. సినిమాలో మరో మూడు బిట్ సాంగ్స్ కూడా ఉన్నాయని రివీల్ చేసారాయన.


Anup Rubens's Tribute to Katamarayudu

మిరా మిరా మీసం పాట హిట్టయినందుకు పీకె అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన అనూప్.. ఇప్పుడు సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అవ్వడం గ్యారంటీ అంటున్నాడు. పంచె కట్టి, చేతిలో కత్తిపట్టి, మీసం మెలేసి రంగంలోకి దిగిన 'కాటమరాయుడు' జనం కోసం ఏం చేశాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. శ్రుతిహాసన్‌ హీరోయిన్. డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌మరార్‌ నిర్మాత. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. శుక్రవారం తొలి పాటను విడుదల చేశారు. ప్రతీ రెండు రోజులకూ ఓ పాట విడుదలవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో పవన్‌, శివ బాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, నాలుగొందల మంది డాన్సర్లపై ఓ పాటని తెరకెక్కిస్తున్నారు. పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూనే మార్చి 18న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించనున్నారు. ఈ వరుస విశేషాలతో మార్చి నెల మొత్తం పవన్ అభిమానులకు పండుగలా మారనుంది.
ఈ పాట‌తోనే ప్ర‌మోష‌న్ల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ప్ర‌తీ రెండు రోజుల‌కూ ఓ పాట‌గానీ, మేకింగ్ వీడియో గానీ విడుద‌ల చేస్తారు.శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

English summary
Katamarayudu is Pawan Kalyan's upcoming movie under the direction of Dolly. Anup Rubens has composed the music for this mass movie. The first song MIRA MIRA MEESAM was released earlier and here is the making of the song. Watch Anup and his team giving tribute to Katamarayudu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu