»   » బూతులు, దానికి తోడు అలాంటి లుక్.. అనుష్కని అలా చూడగలమా!

బూతులు, దానికి తోడు అలాంటి లుక్.. అనుష్కని అలా చూడగలమా!

Subscribe to Filmibeat Telugu
Anushka In Rude Role అనుష్క కోసం వెయిటింగ్...

అనుష్కకు సౌత్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్యారెక్టర్ నచ్చితే ప్రాణం పెట్టి చేస్తుంది స్వీటీ. అనుష్క సోలో హీరోయిన్ గా నటించినా చాలు.. ఆ చిత్రాలు స్టార్ హీరోల చిత్రాల రేంజ్ లో ఆడుతాయి. అలాంటి క్రేజ్ ఉన్న కొద్ది మంది సౌత్ హీరోయిన్లలో అనుష్క కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. గత దశాబ్ద కాలంగా అనుష్క సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. చివరకు బాహుబలి వంటి బడా చిత్రంలో అనుష్కని ఏరి కోరి రాజమౌళి ఎంపిక చేసుకున్నాడంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలలో సోలో హీరోయిన్ గా తిరుగులేని సత్తా చాటింది. మరో క్రేజీ చిత్రం అనుష్క కోసం ఎదురుచూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 సూపర్ తో అడుగుపెట్టి

సూపర్ తో అడుగుపెట్టి

హీరోయిన్లు తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకోవడం కష్టం. అనుష్క సూపర్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అనుష్కకు టాలీవుడ్ లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువే.

 గ్లామర్ రోల్స్ తో యువతలో క్రేజ్

గ్లామర్ రోల్స్ తో యువతలో క్రేజ్

సూపర్, బిల్లా మరో కొన్ని చిత్రాలలో అనుష్క గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించి యువతలో మంచి క్రేజ్ ఏర్పరుచుకుంది.

అబ్బుర పరిచే నటి

అబ్బుర పరిచే నటి

కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు అనుష్క తన నటనతో కూడా అబ్బురపరచగలదు. అరుంధతి, బాహుబలి మరియు భాగమతి వంటి చిత్రాలు అనుష్క నటనకు నిదర్శనం.

 స్టార్ హీరోలతో

స్టార్ హీరోలతో

అనుష్క సౌత్ లోని పలువురు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. సౌత్ లో ఇప్పటికి అనుష్క క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.

 సైజ్ జీరో సినిమా కోసం

సైజ్ జీరో సినిమా కోసం

సాధారణంగా హీరోయిన్లు లావు కావడానికి ఇష్టపడరు. కానీ పాత్ర కోసం అనుష్క సైజు జీరో చిత్రంలో బొద్దుగా తయారై ఆశ్ఛర్యపరిచింది. ఆ చిత్రం తరువాత మళ్ళీ నాజూకు లుక్ లోకి వచ్చేసింది.

పాత్రకు ప్రాణం పొసే నటి

పాత్రకు ప్రాణం పొసే నటి

తన పాత్రని ప్రాణం పెట్టి చేసే కొద్ది మంది హీరోయిన్లలో అనుష్క ఒకరు. అరుంధతి, బాహుబలి వంటి చిత్రాలలో మరో హీరోయిన్ ని ఊహించుకోలేం.

సోలో హీరోయిన్ అంటే

సోలో హీరోయిన్ అంటే

సౌత్ లో సోలో హీరోయిన్ గా సినిమా చేయాలంటే దర్శక నిర్మాతలకు మొదట గుర్తుకు వచ్చే హీరోయిన్ అనుష్కనే.

 మరో క్రేజీ సినిమా రెడీగా

మరో క్రేజీ సినిమా రెడీగా

అనుష్క కోసం మరో క్రేజీ చిత్రం రెడీగా ఉంది. జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన నాచియర్ చిత్రంలో తమిళంలో మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్ చేయడానికి ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో అనుష్కని నటింపజేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అందం, గాంభీర్యం

అందం, గాంభీర్యం

అనుష్క ఇప్పటి వరకు సోలో హీరోయిన్ గా చాలా చిత్రాలు చేసింది. అరుంధతి, రుద్రమ దేవి, భాగమతి వంటి చిత్రాలలో అనుష్క నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ చిత్రాలలో అనుష్క అందం, గాంభీర్యం తగ్గలేదు.

 నాచియర్ అలా కాదు

నాచియర్ అలా కాదు

కానీ జ్యోతిక నటించిన నాచియార్ చిత్రంలో ఆమె పాత్ర డీగ్లామర్ రోల్ గా అనిపిస్తుంది. పాత్ర రెబల్ గా కూడా ఉంటుంది.

బూతులు కూడా

బూతులు కూడా

ఆ చిత్రంలో కొన్ని డైలాగులతో బూతు పదజాలాన్ని కూడా ఉపయోగించారు. ఆ డైలాగులు వివాదాస్పదంగా కూడా మారాయి.

అలాంటి పాత్రలో అనుష్కని

అలాంటి పాత్రలో అనుష్కని

అలాంటి పాత్రలో తెలుగువారు అనుష్కని చూడగలరా అనే కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్ చేయడానికి అనుష్కతో ఇప్పటికే సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చు.

English summary
Anushka may star in Telugu remake of Naachiyaar. Jyothika starrer Naachiyaar became hit movie in Tamil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu