»   » అనూష్క వేశ్యాగృహం నుంచి పారిపోయి...

అనూష్క వేశ్యాగృహం నుంచి పారిపోయి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఏ ఉద్యోగానికైనా ఎంత అనుభవం ఉంటే అంత ఎక్కువ డబ్బులిస్తారు. కానీ మా ఉద్యోగానికి అనుభవం ఎంత తక్కువుంటే అంత ఎక్కువ డబ్బులిస్తారు...' అంటూ అనుష్క వేదం లో కిక్కు ఎక్కించనుంది. ట్రైన్ లో వెళ్తూ చెప్పే ఈ డైలాగ్ హాట్ డైలాగ్ ని ట్రైలర్స్ లో కట్ చేసారు. ఇక ట్రైన్ లో అనూష్క ప్రయాణానికి కారణం...ఆమె అమలాపురంలో ఉండే వేశ్యా గృహం నుంచి పారిపోయిరావటమే నని తెలుస్తోంది. అమలాపురం సరోజగా వేశ్య పాత్రలో అనూష్క ఈ వేదంలో కనిపిస్తుంది. ఆమెను వెంబడిస్తూ ఓ బ్యాచ్ తిరుగుతూంటారు. ఆమెవారి నుంచి తప్పించుకుంటూ హైదరాబాద్ చేరుకుంటుంది. ఆమె తనతో పాటు తిరిగే సారంగి అనే పాత్రకి యాక్సిడెంట్ అయితే హాస్పటిల్ కు చేరుకుని అక్కడ మారటంతో ఈమె కథ సమాప్తమవుతుంది అంటున్నారు. ఈమె పాత్రకీ అల్లు అర్జున్, మనోజ్ పాత్రలకూ సంభంధం ఉండదని చెప్తున్నారు.

ఇక ఈ పాత్రను గురించి అనుష్క మాట్లాడుతూ.."సరోజ అనే వేశ్య పాత్ర ఉంది, ఆ పాత్ర చిత్రణ ఇలా ఉంటుంది..అది నువ్వు చేస్తే బావుంటుంది' అని దర్శకుడు జాగర్లమూడి రా ధాకృష్ణ(క్రిష్‌) చెప్పగానే...ఏ మాత్రం ఆలోచించకుండా...ఆ పాత్ర నేను చేసాను అని అనూష్క చెప్తోంది. అలాగే అద్భుతంగా ఆ పాత్రను అనూష్క రక్తికట్టించారని క్రిష్‌ చెబుతున్నారు. క్రిష్‌ మాట్లాడుతూ-" వేదం లో సరోజ పాత్రను అనుష్క చేసిన విధానం నభూతో నభవిష్యత్‌. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించారామె. రేపు ఒక గొప్ప నటిని తెరపై ప్రేక్షకులు చూడబోతున్నారని నిస్సందేహంగా చెప్పగలను. ఆమె గొప్ప నటి మాత్రమే కాదు......గొప్ప సంస్కారవంతురాలు అని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఇక ఆమె కట్టు,బొట్టు నటన చమేలీలో కరీనా కపూర్ ని గుర్తుకు తెస్తోందని అంటున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu