»   » ‘బాహుబలి-2’పై ఏపీ కేబినెట్ తీర్మానం, రాజమౌళి రియాక్షన్ ఇదీ...

‘బాహుబలి-2’పై ఏపీ కేబినెట్ తీర్మానం, రాజమౌళి రియాక్షన్ ఇదీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి-2' బాక్సాఫీసు వద్ద భారీ విజయం అందుకుని తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాంటిన నేపథ్యంలో సినీ ప్రముఖులతో పాటు అన్ని వర్గాల నుండి ప్రశంసల జల్లుకురుస్తోంది.

Baahubali 2

తాజాగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బాహుబలి-2 సినిమాను, దర్శకుడు రాజమౌళిని ప్రశంసించారు. రాజమౌళి ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తీసారని, తెలుగు సినిమాకు గ్రేట్ కాంట్రిబ్యూషన్ అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం అఫీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా అభినందించారు.

ఏకంగా ఏపీ కేబినెట్ నుండి ప్రశంసలు రావడంతో రాజమౌళి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. వారికి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేసారు. ఏపీ కేబినెట్ నుండి ప్రశంసలు రావడం చాలా అరుదైన, గొప్ప విషయమని, కొన్ని సినిమాలకు మాత్రమే ఈ అవకాశం దక్కుతుందని అంటున్నారు.

మరో వైపు బాహుబలి-2 మూవీ బాక్సాఫీసు వద్ద తన ప్రభంజనం కొనసాగిస్తోంది. ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి రూ. 1000 కోట్ల రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఇండియాలో రూ. 1000 కోట్లు వసూలు చేయబోతున్న తొలి చిత్రం ఇదే.

English summary
"The Cabinet congratulates ssrajamouli for the well deserved and enormous success of Baahubali 2 - a great contribution to Telugu cinema." Andhra Pradesh CM twitter page tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu