»   » ఇదీ సత్తా ఉన్న కథ కి దక్కేగౌరవం : బాలీవుడ్ కి వెళ్లనున్న అప్పట్లో ఒకడుండేవాడు

ఇదీ సత్తా ఉన్న కథ కి దక్కేగౌరవం : బాలీవుడ్ కి వెళ్లనున్న అప్పట్లో ఒకడుండేవాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పట్లో ఒకడుండేవాడు 2016 సంవత్సరం చివరలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో చిన్న సైజు దుమారాన్ని రేపింది. ఈ సినిమాలో విశేషం ఏమిటంటే..ఒక యాంగిల్ లో ఇది స్పోర్ట్స్ సినిమా బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అనిపిస్తుంది. మరో వైపు నుంచి చూస్తే గతంలో మన సమాజంలో జరుగుతున్న ఎన్నో అమానుష సంఘటనలకు డాక్యుమెంటరీగా అనిపిస్తుంది.

ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్ లతోనే ఆసక్తి రేపిన ఈ సినిమా ఖచ్చితంగా చర్చకు దారితీసే అనేక విషయాలను మన ముందు ఉంచుతుంది. ఎటు వైపు మనం ఉండాలో అర్దం కానీ పరిస్దితి తెస్తుంది. నక్సలిజం పాయింట్ తో కథ ని చూపిస్తూ, నడిపిస్తూ...ఓ క్రికెట్ పిచ్చోడు కథని చెప్పటం ఆషామాషి విషయం కాదు.

Appatlo Okadundevadu Hindi remake on the cards

ఓ నిజాయితీ గల పోలీస్ ని చూపిస్తూ ...ఆ నిజాయితీ మరో జీవితం నాశనం కావటానికి దోహదం చేసిందే అనే విషయం చెప్పి మన ఆలోచనలను డిఫెన్స్ లో పడేయటం యాధృచ్చికం కాదు. నిజంగా అప్ప్ట్లో ఒకడుంటే వాడు రొటీన్ సినిమా కాదు. అందుకే ఇప్పుడు "అప్పట్లో ఒకడుండేవాడు" పై బాలీవుడ్ కన్ను పడింది. ఈ సినిమాని హిందీలోకి రేమేక్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.

ప్రతినిధి మూవీ తర్వాత నారా రోహిత్, శ్రీ విష్ణులు అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలో కలిసి నటించగా నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్, విష్ణు క్రికెటర్ పాత్ర పోషించాడు. ఈ సినిమాపై మంచి రివ్యూస్ కూడా రావడంతో బాలీవుడ్ మేకర్స్ అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాన్ని రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం చిత్ర నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి హిందీలో ఈ మూవీని రీమేక్ చేస్తే నారా రోహిత్, శ్రీ విష్ణు పాత్రలకు ఎవరిని ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

English summary
Sagar K Chandra’s directorial venture Appatlo Okadundevadu. According to the director, Bollywood production has begun talks with the Telugu makers for its remake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu