»   » బాహుబలికి కట్టప్ప కష్టాలు: అన్ని షోలు రద్దు: సత్యరాజ్ ఉంటే నో రిలీజ్!

బాహుబలికి కట్టప్ప కష్టాలు: అన్ని షోలు రద్దు: సత్యరాజ్ ఉంటే నో రిలీజ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి (ది బిగినింగ్) సినిమా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ సినిమా రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయి.

బాహుబలి -2 కూడా ఈనెల 28వ తేది ప్రవంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి జక్కన్న రాజమౌళి రంగం సిద్దం చేశారు. ఇదే సందర్బంలో బాహుబలి-1 రీ రిలీజ్ చెయ్యాలని రాజమౌళి టీం నిర్ణయించింది. శుక్రవారం (ఏప్రిల్ 7) ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి-1 రీ రిలీజ్ అయ్యింది. అయితే కర్ణాటకలో బాహుబలి-1 రీ రిలీజ్ ను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి.

వార్నింగ్ ఇచ్చినా విడుదల చేస్తారా !

వార్నింగ్ ఇచ్చినా విడుదల చేస్తారా !

బాహుబలి సినిమా విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ గురువారం బెంగళూరు నగరంలోని యూఎఫ్ఓ కార్యాలయం ముందు కన్నడ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో బాహుబలి-1 రీ రిలీజ్ చెయ్యరాదని యూఎఫ్ఓ సంస్థ అధికారులను హెచ్చరించారు.

బాహుబలి -1 విడుదల చేశారు

బాహుబలి -1 విడుదల చేశారు

కన్నడ సంఘాల హెచ్చరికలు లెక్కచెయ్యకుండా శుక్రవారం బెంగళూరు నగరంతో సహ కర్ణాటక వ్యాప్తంగా బాహుబలి -1 సినిమా (తెలుగు, హిందీ) విడుదల చేశారు. బెంగళూరు నగరంలోని దాదాపు అన్ని మాల్స్, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో సినిమా విడదల చేశారు.

బాహుబలిసినిమా ప్రదర్శన రద్దు

బాహుబలిసినిమా ప్రదర్శన రద్దు

బెంగళూరు నగరంలోని ఒరియన్ మాల్, ఎలిమెంట్స్ మాల్ ను శుక్రవారం ఉదయం కన్నడ సంఘాలు ముట్టడించాయి. ఈ మాల్స్ లో బాహుబలి సినిమా ప్రదర్శన నిలిపివేయాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కన్నడ సంఘాల నాయకులు హెచ్చరించారు. పరిస్థితి అదుపుతప్పుతోందని గమనించిన మాల్ యాజమాన్యం బాహుబలి-1 సినిమా ప్రదర్శన అర్దాంతరంగా నిలిపివేశారు.

సత్యరాజ్ క్షమాపణ చెప్పాలి

సత్యరాజ్ క్షమాపణ చెప్పాలి

ఎలిమెంట్స్ మాల్ లో బాహుబలి సినిమా ప్రదర్శన నిలిపివేసిన తరువాత బయటకు వచ్చిన వాటల్ పార్టీ అధ్యక్షుడ, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ కావేరీ నీటి కోసం పోరాటం చేసే సమయంలో తమిళ నటుడు సత్యరాజ్ కన్నడిగులను కించపరిచే విధంగా మాట్టాడారని, ఆయన కన్నడిగులకు బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు ఆయన నటించిన ఏ సినిమాను కర్ణాటకలో విడుదల చెయ్యనివ్వమని, బాహుబలి-2 కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు.

కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి

కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి

కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా. గోవింద్ కూడా బాహుబలి-1 సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా సినిమాను అడ్డుకోలేదని, ఓ కన్నడ సంఘం నాయకుడిగా సినిమాను అడ్డుకున్నానని స్పష్టం చేశారు.

సత్యరాజ్ మతిలేని మనిషి

సత్యరాజ్ మతిలేని మనిషి

కావేరీ నీటి కోసం పోరాటం జరిగే సమయంలో సత్యరాజ్ ఓ నటుడిగా కాకుండా మతిలేనట్లు కన్నడిగులను కించపిరిచి నీచంగా మాట్లాడాడని, నిజంగా అతను ఓ కెట్టప్ప ( చెడ్డవాడు) అంటూ సా.రా. గోవింద్ అన్నారు. సత్యరాజ్ నటించిన ప్రతి సినిమాను కర్ణాటకలో అడ్డుకుంటామని, బాహుబలి-2 సినిమా విడుదల కానివ్వమని కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

English summary
Kannada Activists protested against 'Baahubali-The Beginning' shows in Bengaluru today (April 7). Hence, Baahubali-The Beginning shows in Orion Mall were cancelled.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu