»   » క్షమాపణ చెప్పాల్సిందే...ఐశ్వర్యారాయ్ డిమాండ్

క్షమాపణ చెప్పాల్సిందే...ఐశ్వర్యారాయ్ డిమాండ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన వ్యక్తిగత జీవితంపై అవాస్తకమైన రాతలు రాసినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐశ్వర్య రాయ్‌ తాజాగా ఓ వార్తా పత్రిక ఆఫీసుకు లేఖ రాసారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఐశ్వర్య రాయ్‌కి 'స్టమక్‌ ట్యూబర్క్యులోసిస్‌' వ్యాధి సోకిందని, దానికి సంబంధించి మందులు వాడుతున్నారని, అవి పూర్తయ్యే వరకు ఆమె గర్భం దాల్చడానికి కుదరదని ఓ ముంబయి కి చెందిన ఓ లీడింగ్ వార్తా పత్రిక కథనం ప్రచురించింది.

ఈ విషయంపై అమితాబ్ మాట్లాడుతూ...ఐశ్వర్యకి టీబీ వ్యాధి సోకిందన్న వార్తలో ఏమాత్రం నిజం లేదు. ఓ కుటుంబ పెద్దగా నేను ఈ వార్తని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. అలాగే నా కుటుంబానికి చెందిన మగవాళ్లపైన ఎలాంటి వదంతులు వచ్చినా నేను భరిస్తాను. కానీ నా ఇంటికి చెందిన ఆడవాళ్లని బజారుకి లాగితే చూస్తూ ఊరుకోను. ఐశ్వర్యని నా కూతురిగా భావిస్తున్నాను. ఆమెకి న్యాయం చేయడానికి నా తుది శ్వాస వరకు పోరాడతాను' అని అమితాబ్‌ పేర్కొన్నారు.

ఆమె భర్త అభిషేక్‌ బచ్చన్‌ స్పందిస్తూ - "నా భార్య అనారోగ్యానికి గురయ్యిందని, అందువల్లే తల్లి కావడంలేదని కథనం ప్రచురించారు. ఇది నిజంగా అమానుషం. నా భార్య జోలికి వస్తే ఊరుకోను. ఈ వదంతి సృష్టించిన సంబంధిత వ్యక్తులు మాకు క్షమాపణ చెప్పాల్సిందే' అని ప్రకటించారు. కానీ ఆ పత్రిక వాటిని లెక్కచేసే స్ధితిలో కనపడటం లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X