'బాహుబలి'కి వాహనం సిద్దం (ఫొటో)

By Srikanya

హైదరాబాద్‌: 'బాహుబలి'కి అనువైన రథం సిద్ధమైందని మహీంద్ర సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్ర తెలిపారు. మహీంద్ర మోటార్స్‌ నుంచి 'టీయూవీ300' అనే కొత్త శ్రేణి జీప్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వాహనానికి బాహుబలి ప్రభాస్‌ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు.

ఈ ప్రచార చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని శనివారం మహీంద్ర గూప్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆ సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్ర ట్విట్టర్‌ ద్వారా 'బాహుబలికి స్వాగతం.. మా వద్ద అనువైన వాహనం సిద్ధంగా ఉంది' అంటూ ట్వీట్‌ చేశారు.

బాహుబలితో ఓ రేంజిలో పేరు తెచ్చుకున్న ప్రభాస్ మహేంద్రవారి TUV300 కు నేషనల్ అంబాసిడర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభాస్ తో యాడ్ ని షూట్ చేసారు.

 Bahubali Prabhas As Mahendra Brand Ambasidor

ఈ యాడ్ లో కేవలం ప్రభాస్ వచ్చి ఈ వెహికల్ గురించి చెప్పటమే కాదు కొన్ని ఊపిరిబిగపట్టే సాహసమైన స్టంట్స్ చేసారు. ఈ స్టంట్స్ ని బాలీవుడ్ పాపులర్ యాక్షన్ డైరక్టర్ పర్వీజ్ షేక్ అందించారు.

మహేంద్ర మేనేజ్మెంట్ ఈ యాడ్ ని లావిష్ గా భారీ బడ్జెట్ తో తీసారు. టీవిలో ఈ విజువల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టన్ చేస్తాయి అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X