twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సామాజిక న్యాయం' అంటున్న బాలకృష్ణ

    By Srikanya
    |

    గుడ్లవల్లేరు: స్ధానిక నెహ్రూనగర్‌కు చెందిన పెయింటర్‌ పంది సురేష్‌ను తెలుగురైతు రాష్ట్రసభ్యులు చాపరాల రాజేశ్వరరావు పర్యటనలో బాలకృష్ణకు పరిచయం చేశారు. మీకు వీరాభిమాని అయిన సురేష్‌ మీ సూపర్‌హిట్‌ చిత్రాలలైన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు విడుదల సమయంలో పుట్టిన తన ఇద్దరు పిల్లలకూ ఆ సినిమాపేర్లనే పెట్టుకున్నారని చెప్పారు. దీంతో బాలకృష్ణ అయితే సామాజిక న్యాయం పాటించాడన్నమాట అంటూ అభినందించారు.

    'శ్రీమన్నారాయణ' చిత్రం తర్వాత బాలయ్య వేరే ఏ సినిమాకూ సైన్ చేయలేదు. హీరోగా కెరీర్ మొదలైన తర్వాత ఆయన ఇంత గ్యాప్ తీసుకోవడం ఇదే ప్రథమం. బాలయ్య విరామానికి కారణం ఏంటో అంతుపట్టని స్థితిలో ఆయన అభిమానులు ఉన్నారు. అయితే బాలకృష్ణ కొత్త చిత్రం మే నుంచి ప్రారంభం కానుంది. బోయపాటి శ్రీను,బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభమైందని సమాచారం. కథ పూర్తిగా నచ్చటంతో వెంటనే బాలకృష్ణ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పట్టాలు ఎక్కించి అభిమానులను సంతోషపెడుతున్నారని తెలుస్తోంది.

    అయితే మరో ప్రక్క బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌ రిపీట్ చేస్తూ రూపొందనున్న చిత్రం 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ కార్యకర్తలకు, ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చేందుకు ఈ చిత్రం ఉపయోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. కానీ అంతగ్యాప్ ఉండదని, అక్టోబర్ కి రిలీజ్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రిప్రొడక్షన్‌ పనులలో ఉన్న ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం పై నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన 'సింహా' చిత్రం భారీ విజయం సాధించింది. మరోసారి బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించేందుకు రంగం సిద్ధమైంది.

    రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రూలర్‌' అనే టైటిల్‌ ఖరారయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రాం అచంట, గోపీచంద్‌ అచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ఈ చిత్రంలో ఇతర నటీనటులు, సిబ్బందిని ఇంకా ప్రకటించవలసి వుంది. బాలయ్యకు తగిన పవర్ ఫుల్ కథతో బోయపాటి సిద్ధం అవుతున్నారు. బాలకృష్ణ చివరగా నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రం ఇటీవల విడుదలై ప్లాప్ అయ్యింది.

    English summary
    Senior hero and TDP star campaigner Nandamuri Balakrishna's tour in Gudla Valleru has begun with Happy note.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X