twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాస్త వెలితిగా ఉంది: బాలకృష్ణ ఆవేదన

    By Srikanya
    |

    సమాజంలో మానవతా విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో తీసిన 'శ్రీరామరాజ్యం"సినిమాపై యువత ఎక్కువగా దృష్టి పెట్టక పోవడం కాస్త వెలితిగా ఉంది అంటూ బాలకృష్ణ ఆవేదన వెళ్లబుచ్చారు. ఆయన నటించిన శ్రీరామ రాజ్యం చిత్రం విజయవంతమైన సందర్భంగా ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఆయన ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.

    అలాగే 'శ్రీరామరాజ్యం"లో నటించడం వల్ల నా జన్మ ధన్యమైంది. బాపు-రమణలు దృశ్యకావ్యంగా ఈ సినిమాను మలిచారు అన్నారు బాలకృష్ణ.అలాగే..నిర్మాత సాయిబాబు ఆధ్యాత్మిక చింతన గల మనిషి. అందుకే అంత గొప్పగా నిర్మించగలిగారు. ఇక సమాజాన్ని సన్మార్గంలో నడిపించే కావ్యం, సంస్కృతికి మార్గదర్శకం రామాయణం. ఆ గ్రంధాన్ని మననం చేసుకోవడం మన బాధ్యత. 40 ఏళ్ల కిత్రం వచ్చిన 'లవకుశ" లాంటి క్లాసిక్‌ని నేటి ట్రెండ్‌కి అనుగుణంగా నిర్మించాలని సంకల్పించడం నిజంగా గ్రేట్ అన్నారు.

    ఇక గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రశంసలందుకోవడం ఆనందంగా ఉంది. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని 'శ్రీరామరాజ్యం"తో రుజువైంది. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ విజయం. నాగరికం పేరుతో యువత అనుబంధాలను విస్మరిస్తున్నారు. అలాంటి వారికి చక్కని సందేశం ఈ సినిమా అని చెప్పుకొచ్చారు.రామాజ్ఞ ప్రకారం, బాబా అనుగ్రహంతో ఈ సినిమా తీశాను. అయితే ఇప్పటికైనా యువత ఈ సినిమా చూడాలి. బాలయ్య నటన నిజంగా అద్భుతం. మరోసారి దేవుడు ఆజ్ఞ ఇస్తే... బాలయ్యతోనే మరో పౌరాణికం తీస్తా"" అని నిర్మాత సాయిబాబు చెప్పారు.

    English summary
    Balakrishna not happy with Sri Rama Rajyam result.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X