ఇండియన్ ఐడల్ పోటీలో శ్రీరాంను గెలిపించండి: బాలకృష్ణ
మన రాష్ట్రంనుంచి ఇండియన్ ఐడల్ షోలో విజయంవైపు దూసుకుపోతున్న శ్రీరాంకు మద్దతు తెలపాలని సినీనటుడు నందమూరి బాలకృష్ణ కోరారు. శ్రీరాం తండ్రి శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో బాలకృష్ణను కలిశారు. శ్రీరాంను గెలిపించి తెలుగువారి సత్తా చాటాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ శ్రీరాం గెలుపు కోరుతూ ఎస్‌ఎంఎస్‌లు పంపాలని బాలకృష్ణ కోరారు.
శ్రీరాంను గెలిపించాలని తెలుగు సినీ పరిశ్రమ కూడా విజ్ఞప్తి చేసింది. కాగా, ఇండియన్ ఐడల్ ఫైనల్ పోటీ దేశ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15వ తేదీన జరుగుతుంది. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు ఎస్ఎంఎస్ లు పంపవచ్చు. ఇండియన్ ఐడల్ ఫైనల్ పోటీ ప్రసారం మాత్రం అదే రోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది.


Click it and Unblock the Notifications











