For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Veera Simha Reddy: జగన్ టార్గెట్ గా బాలకృష్ణ పవర్ ఫుల్ పంచ్ లు?.. అభివృద్ధి అంటూ సెటైర్లు!

  |

  నందమూరి నట సింహం గాడ్ ఆఫ్ మాసెస్ గా వచ్చిన చిత్రం వీర సింహా రెడ్డి. అత్యధిక భారీ అంచనాలతో ఎట్టకేలకు జనవరి 12న అంటే ఇవాళ విడుదలైంది ఈ సినిమా. మరోసారి ద్విపాత్రాభినయంతో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో పవర్ ఫుల్ డైలాగ్ లు, అదిరిపోయే సాంగ్స్ ఉన్నట్లు ఇదివరకు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటల ద్వారా చూశాం. ఇక బాలకృష్ణ సినిమాలో అప్పుడుప్పుడు రాజకీయ పరిస్థితులకు సూట్ అయ్యే విధంగా డైలాగ్ లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో కూడా అలాంటివి చాలానే ఉన్నాయని ట్రైలర్ ద్వారా తెలిసింది. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీర సింహా రెడ్డి వీడియో క్లింప్పింగ్స్ తో మరోసారి స్పష్టంగా అర్థమవుతోంది.

  గోపిచంద్ మలినేనితో సినిమా..

  గోపిచంద్ మలినేనితో సినిమా..

  బాలకృష్ణ తాజా చిత్రం వీర సింహా రెడ్డి. పవర్ ఫుల్ డైలాగ్ లు, జోష్ ఇచ్చే సాంగ్స్ తో అది కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న బాలకృష్ణ సినిమా అంటే అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. అభిమానుల అంచనాలను మరింత పెంచింది ఈ సినిమా డైరెక్టర్. క్రాక్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టి సూపర్ ఫామ్ లు ఉన్న గోపిచంద్ మలినేనితో బాలయ్య బాబు సినిమా అనగానే విపరీతమైన బజ్ క్రేయేట్ చేసింది.

  అంతకుమించి అనేలా డైలాగ్ లు..

  అంతకుమించి అనేలా డైలాగ్ లు..

  బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా అనగానే నందమూరి అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేశారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించింది. బాలయ్య బాబు ఫైట్స్, డ్యాన్స్, సాంగ్స్ అన్నీ ఒకవైపు ఉంటే మరోవైపు ఆయన చెప్పిన డైలాగ్ లు అంతకుమించి అనేలా ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగానే బాలయ్య బాబు సినిమాలో రాజకీయాలకు సంబంధించిన డైలాగ్ లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీర సింహా రెడ్డి సినిమాలో కూడా అదే నిరూపితం అయింది.

  విశ్వవిద్యాలయం పేరు మార్పు..

  విశ్వవిద్యాలయం పేరు మార్పు..

  టీజర్ లో బోసిడికే వంటి పదాలు వాడగ.. ట్రైలర్ లో ఉంకాస్తా డోస్ పెంచారు. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ, చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.. మార్చలేరు.. అంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పరోక్షంగా బాలకృష్ణ సెటైర్లు వేశారు. ఇటీవల ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చిన వివాదాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ డైలాగ్ పెట్టి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమైంది.

  ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు..

  ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు..

  అలాగే ట్రైలర్ లో పదవి చూసుకొని నీకు పొగరేమో.. కానీ బై బర్తే నా డిఎన్‌ఏకు పొగరెక్కువ అంటూ బాలకృష్ణ మరో కౌంటర్ వేసినట్లయింది. ఇప్పుడు తాజాగా ఇవాళ విడుదలైన సినిమాలో ఏపీ సీఎంపై ఇలాంటి సెటైరికల్ డైలాగ్ లు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. వీర సింహా రెడ్డి సినిమాను వీక్షించిన పలువురు దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోల్లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ లు ఏపీ ప్రభుత్వంపై కౌంటర్లు వేస్తున్నట్లుగా ఉన్నాయి.

  మేం అధికారంలో ఉన్నాం..

  మేం అధికారంలో ఉన్నాం..


  సినిమాలో హోమంత్రిని వీర సింహా రెడ్డి కలిసే సీన్ ఉంది. అందులో మేం అధికారంలో ఉన్నామని హోం మంత్రి అంటే.. కంగ్రాచ్యులేషన్స్ అని బాలయ్య బాబు అంటారు. నేను హోమ్ మినిస్టర్ అని అంటే.. గ్లాడ్ టు మీట్ యూ అని కౌంటర్ ఇస్తారు. ఇక్కడ ఏం జరగాలో.. ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు అని హోం మినిస్టర్ అంటే.. చెప్పుకునే అలవాటు నాకు లేదు. జీవోను యాజిటీజ్ గా అమలు చేస్తూ ఉంటాను బాలకృష్ణ సమాధానం ఇస్తాడు. అందుకో జీవోనా అన్నదానికి.. మీ జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్ అని బాలకృష్ణ అన్నారు.

  జీతాలు ఇవ్వాలి.. బిచ్చం కాదు..

  జీతాలు ఇవ్వాలి.. బిచ్చం కాదు..

  అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు అని హోం మినిస్టర్ అంటే.. ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్. ప్రగతి సాధించడం అభివృద్ధి. ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చం వేయడం కాదు. పని చేయడం అభివృద్ధి.. పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం కాదు. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి.. ఉన్న పరిశ్రమలు మూయడం కాదు.. బుద్ధి తెచ్చుకో.. అభివృద్ధికి అర్థం తెలుసుకో అని ఘాటుగా విమర్శలు సంధించారు బాలకృష్ణ.

  వైసీపీ లీడర్ల స్పందన..

  బాలకృష్ణ అలా అనడంతో మరి వచ్చే పరిశ్రమను ఎందుకు వద్దంటున్నావ్ అని హోమ్ మినిస్టర్ అడిగితే.. వాడు దోచుకోవడానికి వచ్చాడు. నాట్ అలవుడ్ అని బాలకృష్ణ చెప్పడం వరకు ఆ వీడియో ఉంది. ప్రస్తుతం ఇలాంటి వీడియోలు నెట్టింట్లో షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి డైలాగ్ లతో ఏపీ ప్రభుత్వంపై కౌంటర్లు వేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సాయి మాధవ్ బుర్రా రాసిన ఈ డైలాగ్ లకు వైసీపీ లీడర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

  English summary
  Balakrishna Setaires On AP CM Jagan Mohan Reddy And Government In Gopichand Malineni Veera Simha Reddy Movie. Video Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X