»   » అల్లరి: అక్కినేని లాగ బాలకృష్ణ ఫన్నీ సెల్ఫీ (ఫొటో)

అల్లరి: అక్కినేని లాగ బాలకృష్ణ ఫన్నీ సెల్ఫీ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ సెట్స్ పై నటించేటప్పుడు లీనమై ఎంత సీరియస్ గా ఉంటారో...ఆఫ్ ది స్క్రీన్ అంత సరదాగా అందరితో కలిసి పోయి అల్లరి చేస్తూంటారు. తాజాగా ఆయన సైమా అవార్డులకు హాజరయ్యారు. అక్కడ తన అభిమానులతో, అక్కడున్న వారితో సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇదిగో ఇలా అక్కినేనిలా ఫోజ్ పెట్టి సెల్ఫీ దిగారు. మీరు ఈ ఫోటో చూసి ఎంజాయ్ చేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వరుసగా నాలుగో ఏడాది ఈ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి 'సైమా' పండగ దుబాయ్‌లో జరగబోతోంది. గురు, శుక్రవారాల్లో 'సైమా' అవార్డు వేడుకను అట్టహాసంగా చేయబోతున్నారు.

Balakrishna Funny Selfie: Being ANR

తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన సినీ తారలు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రముఖ హీరో రానా సైమా వేడుకకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ తన ఆటపాటలతో అలరించడానికి సిద్ధమయ్యాడు.

'సైమా' (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) అంటేనే సంబరం! దక్షిణాది తారలంతా ఓ చోట కలసి సందడి చేసే వేదిక.. వినోదాల వేడుక. ఆట పాటలు, ఆనందోత్సవాల సమ్మేళనం. మరోసారి ఈ పండుగకు రంగం సిద్ధమైంది.

Balakrishna Funny Selfie: Being ANR

శ్రియ, తాప్సి, ఆదాశర్మ, కృతి కర్బంద, షర్మిలా మాండ్రే, పూజా హెగ్డే.. వీళ్లంతా తమ ఆటపాటలతో అలరించడానికి సిద్ధమయ్యారు. 'సైమా' వేడుకల్లో ఈ కథానాయికలంతా సూపర్‌ హిట్‌ గీతాలకు నృత్యాలు చేయబోతున్నారు. బుధవారం ఈ హీరోయిన్స్ నృత్య సన్నాహాల్లో బిజీ బిజీగా గడిపారు. దేవిశ్రీ ప్రసాద్‌ తన ఆటపాటలతో అలరించడానికి సిద్ధమయ్యాడు.

English summary
It's Balakrishna's Funny Selfie being Akkineni Nageswara Rao Simaa 2015 function.
Please Wait while comments are loading...